ఒకే వ్యక్తిని పెళ్లాడిన కవల అక్కాచెల్లెళ్లు! దేవుడి రాతని ఎదిరించి గెలిచారు!

కవల పిల్లలు ఎప్పుడు కూడా ఇద్దరు ఆరోగ్యంగా ఉండలేరు. ఎంతో మందికి ఎన్నో లోపాలు ఉంటాయి, అయితే ఇక్కడ ఇద్దరు అక్కచెల్లెళ్లకు మాత్రం దేహం ఒకటే కానీ తలలు రెండు.. అలాగే వీరు ఇష్టపడి ఇచ్చిన మనసు కూడా ఒకరికే. వీరి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీరి స్టోరీ చదివేయాల్సిందే.

కవల పిల్లలు ఎప్పుడు కూడా ఇద్దరు ఆరోగ్యంగా ఉండలేరు. ఎంతో మందికి ఎన్నో లోపాలు ఉంటాయి, అయితే ఇక్కడ ఇద్దరు అక్కచెల్లెళ్లకు మాత్రం దేహం ఒకటే కానీ తలలు రెండు.. అలాగే వీరు ఇష్టపడి ఇచ్చిన మనసు కూడా ఒకరికే. వీరి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీరి స్టోరీ చదివేయాల్సిందే.

సహజంగా ట్విన్స్ అంటే వీరిలో చాలా రకాలుగా ఉంటారు. ఐడెంటికల్ ట్విన్స్ , అన్ ఐడెంటికల్ ట్విన్స్ ఇలా చాలా మంది చాలా రకాలుగా ఉంటూ ఉంటారు. అందులో కూడా అందరు ఆరోగ్యంగా ఉంటారా అంటే.. చాలా అరుదుగా అలాంటి వారు కనిపిస్తూ ఉంటారు. కవలలలో ఎవరికో ఒకరికి.. ఎదో ఒక చిన్న లోపం అయినా ఉంటుంది. మరి కొంతమైందికైతే.. శరీరాలు అతుక్కుని ఉంటాయి. ఇలా చాలా రకాలుగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇద్దరు సిస్టర్స్ కూడా ఈ కోవకు చెందిన వారే.. ఈ ట్విన్ సిస్టర్స్ కు.. దేహం ఒకటే.. కానీ తలలు మాత్రం రెండు. పేరెంట్స్ వారిని ఎలాగూ ఒకలా కష్టపడి పెంచారు. మరి, వారి పెళ్లి మాటేంటి! వారు కూడా అందరిలాంటి వారే కదా.. సో వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు. కానీ, ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారట. అసలు వీరి కథ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ట్విన్ సిస్టర్స్.. ఇప్పటికే అందరికి పరిచయమే..వారే.. అబ్బి, బ్రిటనీ హెన్సెల్. 1996లో ‘ది ఓప్రా విన్‌ఫ్రే షో’ ద్వారా ఈ సిస్టర్స్ ప్రపంచానికి పరిచయం అయ్యారు. వీరు 1990లో జన్మించారు. వీరిద్దరికి ఒకటే గుండె, ఒకటే శరీరం కానీ రెండు ముఖాలు ఉంటాయి. వీరు పుట్టినపుడు వీరికి ఆపరేషన్ చేసి.. వీరిని విడదీయాలనే ప్రయత్నం చేశారట. కానీ, అది వారి ప్రాణానికి ప్రమాదం అని ఆగిపోయారట. అయితే, ఈ ఇద్దరు అక్క చెల్లెల్లు ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ వార్తల్లో నిలవడానికి కారణం.. వీరిద్దరూ కలిసి ఒకే వ్యక్తిని పెళ్లాడడం. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. 2021 సంవత్సరంలో ఈ ట్విన్ సిస్టర్స్ ఇద్దరూ.. యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ నుండి రిటైర్ అయిన జోష్ బౌలింగ్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరి ఫోటోలు ఇప్పుడు బయటకు రావడంతో.. అందరూ వీరిపై కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

ఇక అబ్బి, బ్రిటనీ హెన్సెల్ సిస్టర్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం వీరు అమెరికాలో ఉంటున్నారు. వీరిద్దరూ కూడా ఒకటే దేహం రెండు తలలతో జన్మించడం .. దేవుడు రాసిన రాత. అయినా సరే.. వారే తల రాతను వారే రాసుకుని విధిని ఎదురించి.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరూ కూడా టీచర్లుగా పనిచేస్తూ ఐదో తరగతి వరకు పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. ఈ ట్విన్స్ ప్రత్యేకత ఏంటంటే.. వీరిద్దరూ ఒకే శరీరంలో ఉన్నా కానీ, అబ్బి శరీరం, కుడి చేయి, కాలును.. బ్రిటనీ శరీరం ఎడమ భాగాన్ని నియంత్రిస్తుందట . బహుశా అందుకేనేమో వీరిద్దరిని విడదీస్తే వీరి ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్స్ వీరికి సర్జరీ చేయలేదు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments