Colombia-Spanish Shipwreck Filled Gold, Diamonds: 200 టన్నుల బంగారంతో సముద్రంలో మునిగిన నౌక.. నిధి కోసం ముమ్మర వేట

200 టన్నుల బంగారంతో సముద్రంలో మునిగిన నౌక.. నిధి కోసం ముమ్మర వేట

200 టన్నుల బంగారం, వజ్రాలతో వెళ్తున్న నౌక ఒకటి సముద్రంలో మునిగిపోయింది. ఈ నిధి కోసం ప్రస్తుతం ముమ్మర వేట సాగిస్తున్నారు. ఆ వివరాలు..

200 టన్నుల బంగారం, వజ్రాలతో వెళ్తున్న నౌక ఒకటి సముద్రంలో మునిగిపోయింది. ఈ నిధి కోసం ప్రస్తుతం ముమ్మర వేట సాగిస్తున్నారు. ఆ వివరాలు..

బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. ఇక మన భారతీయుల విషయమైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధర ఎంత పెరిగినా కొంటూ ఉంటారే తప్ప.. వెనకడుగు వేయరు. ఇక బంగారు నిధి దొరుకుతుంది అంటే ప్రాణాలకు తెగించి మరీ.. వెదుకులాట ప్రారంభిస్తారు. ఇప్పుడు కూడా ప్రపంచంలోని చాలా మంది పసిడి ప్రియులు ఓ బంగారు నిధి కోసం వేట మొదలు పెట్టారు. 200 టన్నుల బంగారం, రత్నాలతో బయలుదేరిన ఓ నౌక.. సముద్రంలో ముగినిపోయింది. శత్రువుల దాడి వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అయితే ఇన్నాళ్లు.. ఆ నౌక ఎక్కడ మునిగిందో గుర్తించినా.. ఎవరూ దాని దగ్గరకు వెళ్లలేదు. కానీ తాజాగా ఓ దేశం మాత్రం ఆ నిధి కోసం ముమ్మర వేట ప్రారంభిచండంతో.. ఈ బంగారు నిధి వార్తల్లోకి వచ్చింది. ఆ వివరాలు..

అయితే ఈ నౌక ముగినిపోయింది ఇప్పుడు కాదు.. సుమారు 300 సంవత్సరాల క్రితం. అప్పుడు 200 టన్నుల బంగారం, రత్నాలతో స్పానిష్‌కు బయల్దేరిన ఓ నౌక.. శత్రువుల దాడిలో ధ్వంసం అయ్యి సముద్రంలో మునిగిపోయింది. అత్యంత విలువైన ఆ సంపద.. నీటి పాలయ్యింది. ఇక కొన్నాళ్ల క్రితమే ఆ నౌక ముగినిపోయిన స్థలాన్ని గుర్తించారు. కానీ.. వాటాల్లో తేడా వచ్చి.. ఎవరూ దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేయలేదు. అయితే తాజాగా కొలంబియా దేశం.. కరేబియన్‌ సముద్రంలో మునిగిన శాన్‌జోస్‌ ఈ పురతాన నౌకను తాము వెలికి తీస్తామని ప్రకటించింది. దాంతో అమెరికా, స్పెయిన్‌, పెరూ సహా అనేక దేశాలు అప్రమత్తం అయ్యాయి.

సుమారు 300 ఏళ్లకు పైనే అనగా 1708 సంవత్సరంలో స్పెయిన్‌కు చెందిన నౌక దాదాపు 200 టన్నుల బంగారం, వెండి, రత్నాలు వంటి విలువైన సంపద తీసుకుని.. పెరూ నుంచి కొలంబియాకు బయల్దేరింది. అయితే సముద్ర మార్గమధ్యలో ఈ నౌక మీద శత్రువులు దాడి చేయడంతో.. దానిలో ఉన్న 600 మంది సిబ్బందిలో చాలా మంది ప్రాణాలు విడిచారు. ఈ నౌక సముద్రగర్భంలో సుమారు 600 మీటర్ల లోతులో శిథిలాల కిందే ఉండిపోయింది. దీనికి రక్షణగా ఉంచిన 64 రాగి తుపాకులు కూడా ఇక్కడే ఉండిపోయాయి.

అయితే అమెరికాకు చెందిన సముద్ర గర్భాన్వేషణ సంస్థ సీసెర్చి ఆర్మడా.. 1981లోనే ఈ నౌక శిథిలాలను గుర్తించినట్లు ప్రకటించింది. గతంలోనే దీన్ని వెలికి తీసేందుకు సదరు సంస్థ.. కొలంబియా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేసింది.. కానీ అది విఫలం అయ్యింది. ఈ క్రమంలో తాజగా కొలంబియా ప్రభుత్వం.. ఈ నిధిని వెలికి తీసేందుకు రంగం సిద్ధం చేస్తుంది.

ఇందుకోసం ది కొలంబియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంత్రోపాలజీ అండ్‌ హిస్టరీ(ఐసీఏఎన్‌హెచ్‌) సంస్థ ప్రత్యేకమైన రిమోట్‌ సెన్సర్లను వాడి నౌకను ఫొటోగ్రఫి చేయనుంది. దీని ఆధారంగా ఆ తర్వాత పరిశోధన కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత నౌక నుంచి పురాతన వస్తువులు, సందను వెలికి తీస్తామని ప్రకటించారు. నౌక ముగినిపోయిన ప్రదేశాన్ని ఐసేఎన్‌హెచ్‌ ఇప్పటికే రక్షిత పురాతత్వ ప్రదేశంగా ప్రకటించింది. అయితే ఇప్పుడు అమెరికా, పెరూ, స్పెయిన్‌ ప్రభుత్వాలు.. ఆ నౌకపై యాజమాన్య హక్కులు తమవే అని చెబుతున్నాయి. మరి ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Show comments