Vinay Kola
Gold: బంగారం విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మనలో చాలా మంది కూడా బంగారం పోగొట్టుకుంటూ ఉంటారు.
Gold: బంగారం విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మనలో చాలా మంది కూడా బంగారం పోగొట్టుకుంటూ ఉంటారు.
Vinay Kola
బంగారం అంటే అందరికీ చాలా ఇష్టమే. ఇది ఎంతో విలువైనది. ఇంకా చాలా ఖరీదైనది కూడా. కాబట్టి బంగారాన్ని ఖచ్చితంగా ఎంతో జాగ్రత్తగా ఉంచుకోవాలి. బంగారం విషయంలో అజాగ్రత్తగా అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా దొంగతనం జరగొచ్చు. లేదంటే ఎక్కడైనా పోగొట్టుకునే ప్రమాదం కచ్చితంగా ఉంది. ముఖ్యంగా బయటకి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది మహిళల బంగారాన్ని దొంగతనం చేసిన వైరల్ వీడియోలు మనం చాలానే చూశాం. మహిళాలు రోడ్డుపై వెళుతున్నప్పుడు వారి మెడలో బంగారాన్ని దొంగలు దొంగిలిస్తున్న సంఘటనలు బాగా పెరిగిపోయాయి. అందుకే బంగారం విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అయితే, మీ బంగారం పోయినా కూడా మీరు 100 % రీఫండ్ డబ్బులు వాపస్ పొందొచ్చు. అదెలాగో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మీరు కొనే బాగారంపై ఫ్రీ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ సంగతి చాలా మందికి కూడా తెలీదు. ఈ విషయాన్ని బంగారం కొనేటప్పుడు మీకు ఎవరు చెప్పకపోవచ్చు. అయితే దీని గురించి ముందే తెలుసుకోవడం వల్ల మీరు బెనిఫిట్ పొందవచ్చు. బంగారం కొనేటప్పుడు కచ్చితంగా బిల్, గోల్డ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మన దేశంలో చాలా ఫేమస్ గోల్డ్ కంపెనీలు ఫ్రీగా గోల్డ్ ఇన్సూరెన్స్ పాలసీలను ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ ఇన్సూరెన్స్ ఒక సంవత్సరం పాటు ఫ్రీగా వస్తుంది. ఆ తరువాత మనం దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. బంగారం కొనేవారు కచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడం మాత్రం అస్సలు మరచిపోకండి. ఈ ఇన్సూరెన్స్ వలన మన బంగారం పోయినప్పుడు మనకు కచ్చితంగా 100 పర్సెంట్ రీఫండ్ డబ్బులు వస్తాయి. అయితే మనం గోల్డ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక కచ్చితంగా కొన్నివిషయాలు గుర్తు పెట్టుకోవాలి.
బంగారం కొనేటప్పుడు బిల్లు కచ్చితంగా తీసుకోవాలి. దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే ఇన్సూరెన్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ రెండు ఉంటేనే మీకు పూర్తిగా 100 పర్సెంట్ రీఫండ్ వస్తుంది. అయితే ఇన్టెన్షనల్ గా బంగారం పోగొట్టుకుంటే మీకు రీఫండ్ రాదు. ఇదీ సంగతి. మీ బంగారం పోయినప్పుడు దానికి సంబంధించిన బిల్, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ మీరు కంపెనీకి ఇస్తే వాటిని పూర్తిగా పరిశీలించి మీ బంగారం బిల్ ఎంతయ్యిందో అంత రీఫండ్ డబ్బులు వస్తాయి. కాబట్టి బంగారం కొంటున్నప్పుడు కచ్చితంగా బిల్ తో పాటు గోల్డ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. ఇంకా మీ దగ్గర బంగారం ఉంది గోల్డ్ ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.