Venkateswarlu
Venkateswarlu
సాధారణంగా మహిళలు గర్భం దాల్చిన 9 నెలలకు లేదా ఓ రెండు మూడు నెలలు అటో, ఇటో డెలివరీ అవుతుంటారు. కానీ, మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీలోని మహిళ మాత్రం గర్భం దాల్చిన 61 ఏళ్లకు డెలివరీ అయింది. ఆమె దాదాపు 61 ఏళ్ల పాటు పిండాన్ని కడుపులో మోసింది. చివరకు వయో భారం కారణంగా కడుపులో పిండాన్ని మోయలేక ఆపరేషన్ చేయించుకుంది. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన హ్యాంగ్ యిజున్ అనే మహిళ 1948లో గర్భం దాల్చింది. దీంతో ఆమె డాక్టర్ దగ్గరకు వెళ్లింది.
ఆమెను పరీక్షించిన వైద్యులు.. పిండం గర్భాశయం బయట పెరుగుతోందని తేల్చారు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పారు. ఆపరేషన్ చేసి ఆ పిండాన్ని బయటకు తీయాలని అన్నారు. అయితే, ఆపరేషన్ చేయించుకోవటానికి డబ్బులు లేని కారణంగా ఆమె పిండాన్ని అలాగే వదిలేసింది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. ఆమె కడుపులోని పిండం రాయిలాగా గట్టిగా మారిపోయింది. దీన్నే వైద్య పరిభాషలో లితోపెడియాన్ అంటారు. వయసు పెరుగుతూ పోతున్న కారణంగా కడుపులోని పిండంతో ఆమెకు ఇబ్బంది మొదలైంది.
ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ చేయించుకోవాలని ఆమె అనుకుంది. దాదాపు 61 ఏళ్ల తర్వాత 2009లో ఆపరేషన్ చేయించుకుంది. వైద్యులు చనిపోయిన పిండాన్ని ఆమె కడుపులోంచి బయటకు తీశారు. ఈ ఆపరేషన్ చేయించుకునే నాటికి హ్యాంగ్ యిజున్ వయసు 92 ఏళ్లు కావటం విశేషం. ఇక, హ్యాంగ్ యిజున్ కేసు ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. తాజాగా కూడా ఆమెకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. నెటిజన్లు ఆమె గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు. మరి, హ్యాంగ్ యిజున్ 61 ఏళ్ల పాటు పిండాన్ని తన కడుపులో మోయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
In 1948, Huang Yijun, a 31-year-old Chinese woman, discovered that she was pregnant. She went to the doctor, who informed her that the fetus was growing outside her uterus, specifically in her abdomen, a condition known as ectopic pregnancy.
Huang needed to undergo surgery to… pic.twitter.com/ttu8ARl0jj
— Historic Vids (@historyinmemes) August 17, 2023