iDreamPost
android-app
ios-app

చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది జల సమాధి!

చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది జల సమాధి!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలను నడపడంతో ఈ ఘోర ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. మరికొన్ని ప్రమాదాల్లో ప్రయాణికులతో వెళ్తున్నవాహనాలు వంతెనపై నుంచి నదిలో పడిపోవడం, చెరువులోకి వెళ్లిపోవడం వంటి ఘటనలు జరిగి..ఎందరో అమాయకులు జల సమాధి అయ్యారు. నిన్న ఏపీలో  జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. తాజాగా బంగ్లాదేశ్ లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది జలసమాధి అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

శనివారం సాయంత్రం బంగ్లాదేశ్‌లో భండారియా జిల్లా నుంచి ఫిరోజ్‌పూర్‌కు 70 మందితో ఓ బస్సు బయలు దేరింది.అందరూ ఎంతో ప్రశాంతగా తమ గమ్యస్థానాలకు చేరుకునే సమయం గురించి ఆలోచిస్తున్నారు. ఇక ఈ బస్సు ఝలకతి సదర్ ఉపజిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలోకు చేరుకుంది. అక్కడే ఉన్న చెరువు కట్టపై ఉన్న దారిలో ఈ బస్సు వెళ్తేంది. ఇదే సమయంలో  స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం వద్ద ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. క్షణాల్లో బస్సులు నీటిలో మునిగిపోయింది.

బస్సులో చెరువులోకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున కేకలు పెట్టారు. ఈ ప్రమాదంలో 17 మంది నీటిలో మునిగి మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో35 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఝలకతి జిల్లా ఆసుపత్రికి తరలించారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి… ఇలాంటి ఘోరమైన ప్రమాదాలకు కారణమైన వారికి ఎలాంటి శిక్షలు విధించాలి?.  మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంల తెలియజేయండి.

ఇదీ చదవండి:  APలో ఫ్లెక్సీలు కడుతూ కరెంట్‌ షాక్‌తో స్టార్‌ హీరో అభిమానులు మృతి