iDreamPost
android-app
ios-app

Cancer: క్యాన్సర్‌ బారిన పడ్డ బ్రిటన్‌ యువరాణి.. రాజకుటుంబాన్ని వదలని మహమ్మారి

  • Published May 11, 2024 | 1:30 PMUpdated May 11, 2024 | 1:30 PM

Kate Middleton: చిన్నా, పెద్దా, సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరిని పలకరిస్తోంది క్యాన్సర్‌ మహమ్మారి. బ్రిటన్‌ యువరాణి క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఆ వివరాలు..

Kate Middleton: చిన్నా, పెద్దా, సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరిని పలకరిస్తోంది క్యాన్సర్‌ మహమ్మారి. బ్రిటన్‌ యువరాణి క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఆ వివరాలు..

  • Published May 11, 2024 | 1:30 PMUpdated May 11, 2024 | 1:30 PM
Cancer: క్యాన్సర్‌ బారిన పడ్డ బ్రిటన్‌ యువరాణి.. రాజకుటుంబాన్ని వదలని మహమ్మారి

క్యాన్సర్‌ మహమ్మారి.. ప్రపంచాన్ని ఒణికిస్తోన్న అతి పెద్ద సమస్య. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలడం లేదు. ఇక క్యాన్సర్‌ చికిత్స ఎంతో ఖర్చుతో కూడుకున్నదే కాక.. చాలా కష్టమైన ప్రక్రియ కూడా. సామాన్యులంటే ఏమో అనుకోవచ్చు.. కానీ తిండి, నిద్ర విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే సెలబ్రిటీలు కూడా మహమ్మారి బారిన పడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. సోనాలి బింద్రే, మనీషా కోయిరాలా, హంసా నందిని వంటి వారు క్యాన్సర్‌ బారిన పడి కోలుకున్నారు. ఇక తాజాగా ఈ జాబితాలోకి.. బ్రిటన్‌ యువరాణి చేరారు. తాను క్యాన్సర్‌ బారిన పడ్డానని.. చికిత్స కూడా తీసుకుంటున్నానని ఆమె స్వయంగా ప్రకటించాడంతో ఈ వార్త సంచలనంగా మారింది. ఆ వివరాలు..

బ్రిటన్‌ యువరాణి కేట్‌ మిడిల్టన్‌ క్యాన్సర్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. గత కొన్ని నెలలుగా కేట్‌ మిడిల్టన్‌.. బయట ప్రపంచానికి కనిపించకపోవడంతో.. ఆమె ఆరోగ్యంపై అనేక రూమర్స్‌ వచ్చాయి. అంతేకాక ఈ ఏడాది జనవరిలో ఆమెకు సర్జరీ జరిగిందని.. తర్వాత కోమాలోకి వెళ్లారని పుకార్లు వినిపించాయి. ఈ క్రమంలో యువరాజు విలియమ్‌ తొలిసారిగా తన భార్య కేట్‌ మిడిల్టన్‌ ఆరోగ్యంపై స్పందించారు. తన భార్య ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉందని.. ఆమె చాలా బాగుందని తెలిపారు. అలానే తన ఆరోగ్యంపై కేట్‌ కూడా ఒక ప్రకటన చేశారు. మార్చిలో తాను క్యాన్సర్‌ బారిన పడ్డానని.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని.. కేట్‌ స్వయంగా వెల్లడించారు. దాంతో ఆమె ఆరోగ్యంపై వస్తోన్న పుకార్లకు చెక్‌ పడింది.

Britain Princess

తాజాగా ఐస్‌ ఆఫ్‌ స్కిల్లీలో రెండు రోజుల పర్యటన కోసం ప్రిన్స్‌ విలియమ్‌ ఒంటరిగా వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ఆయన భార్య అనారోగ్యం గురించి ప్రశ్నించగా.. ఆయన పై విధంగా బదులిచ్చారు. ఇక బ్రిటన్‌ రాజకుటుంబంలో ఇప్పటికే ప్రిన్స్‌ విలియమ్‌ తండ్రి కింగ్‌ ఛార్లెస్‌-3 క్యాన్సర్‌ బారిన పడి.. చికిత్స తీసుకుని కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన విధులకు హాజరవుతున్నారు. ఆయన తర్వాత కేట్‌ మిడిల్టన్‌ క్యాన్సర్‌ బారిన పడి.. చికిత్స తీసుకుంటున్నారు.

గత డిసెంబర్‌ నుంచి కేట్‌ మిడిల్టన్‌ జనాల్లోకి రాలేదు. దాంతో పొత్తి కడుపు సర్జరీ తర్వాత ఆమె కోమాలోకి వెళ్లినట్లు సోషల్‌ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. కేట్‌కు సర్జరీ జరిగిన విషయాన్ని జనవరి 17న ప్రిన్స్‌ అండ్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కార్యాలయం ప్రకటించింది. సర్జరీ తర్వాత ఆమె 10-14 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని.. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుంటుందని వేల్స్‌ కార్యాలయం ప్రకటించింది.ఇక అప్పటి నుంచి యువరాణి కేట్ బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. తర్వాత మార్చిలో ఆమె స్వయంగా తాను క్యాన్సర్‌ బారినపడ్డట్టు ప్రకటించి, చికిత్స కొనసాగుతోందని తెలిపారు. తాజాగా, ఆమె కోలుకుంటున్నట్టు విలియమ్ చేసిన ప్రకటన వారి అభిమానులకు ఊరట నిచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి