iDreamPost
android-app
ios-app

ఇరాన్‌లో జంట పేలుళ్లు.. 100 మంది మృతి!.. 170మందికి గాయాలు!

ఇరాన్ లో ఘోర ఘటన చోటుచేసుకుంది. బుదవారం జరిగిన జంట బాంబు పేలుళ్లు ఇరాన్ ను వణికించాయి. ఈ ఘటనలో 100 మందికి పైగా మృతి చెందగా, 170 మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తోంది.

ఇరాన్ లో ఘోర ఘటన చోటుచేసుకుంది. బుదవారం జరిగిన జంట బాంబు పేలుళ్లు ఇరాన్ ను వణికించాయి. ఈ ఘటనలో 100 మందికి పైగా మృతి చెందగా, 170 మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తోంది.

ఇరాన్‌లో జంట పేలుళ్లు.. 100 మంది మృతి!.. 170మందికి గాయాలు!

ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధాలు చోటుచేసుకుంటుండంతో అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఉగ్రవాదులు దాడులు చేస్తుండడంతో వందల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇరాన్ లో ఘోరం జరిగింది. బాంబు పేలుళ్లతో ఇరాన్ వణికిపోయింది. స్వల్ప వ్యవధిలోనే జంట పేలుళ్లు చోటుచేసుకోవడంతో అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఇరాన్‌లో బుధ‌వారం జ‌రిగిన‌ భారీ పేలుళ్లలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 170మంది గాయపడ్డట్లుగా తెలుస్తుంది. ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్​కు చెందిన ఖుద్స్‌ ఫోర్స్‌కు నేతృత్వం వహించిన ఖాసీం సులేమాని సంస్మరణ సభలో ఈ దుర్ఘటన జ‌రిగింది.

కాగా ఇరాన్ లో పేలుళ్లకు ఉగ్ర‌వాదులే కారణమని అక్కడి మీడియా వెల్లడిస్తోంది. బాంబులను రిమోట్ ద్వారా పేల్చినట్టు ఇరాన్ కు చెందిన వార్తా సంస్థ ‘తస్నీమ్’ తెలిపింది. స్వల్ప వ్యవధిలో బాంబులు పేలాయని కెర్మన్ మేయర్ సయీద్ పేర్కొన్నారు. కాగా 2020 జనవరి 3వ తేదీన ఇరాన్ లోని బాగ్దాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులో ఆ దేశ దివంగత జనరల్ ఖాసీం సులేమానీ అమెరికా డ్రోన్ దాడిలో మరణించాడు. ఈ హత్యకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు ఇచ్చాడు. అయితే సులేమానీ మరణించిన నాలుగో వర్థంతిని నేపథ్యంలో ఆయన సమాధి అయిన కెర్మాన్ లోని సాహెబ్ అల్-జమాన్ మసీదు సమీపంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో పేలుళ్లు సంభవించాయి. భారీ పేలుళ్లు చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని అధికారులు ఆసుపత్రులకు తరలిస్తున్నారు.