Arjun Suravaram
Pakistan Beggars: ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం నిండా మునిగిపోయి.. సాయం కోసం ఇతర దేశాలను ప్రాధేయబడుతుంది. ఇదే సమయంలో ఆ దేశంలో ఓ విచిత్రమైన బిజినెస్ నడుస్తోంది.
Pakistan Beggars: ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం నిండా మునిగిపోయి.. సాయం కోసం ఇతర దేశాలను ప్రాధేయబడుతుంది. ఇదే సమయంలో ఆ దేశంలో ఓ విచిత్రమైన బిజినెస్ నడుస్తోంది.
Arjun Suravaram
సాధారణంగా చాలా మంది వివిధ రకాల వ్యాపారాలు చేస్తుంటారు. అలా ఆలోచనలతో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి, ఇతర మార్గాల్లో బిజినెస్ సాగిస్తుంటారు. అలానే దేశాలు సైతం కొత్త కొత్త ఆలోచనలతో తమ దేశంలో వ్యాపారాలను విస్తరిస్తుంటాయి. కానీ పాకిస్థాన్ లో మాత్రం ఓ విచిత్రమైన బిజినెస్ నడుస్తోంది. అదే భిక్షాటనం. ఇది మన దేశంలో మాములు పనినే అయినా..పాక్ లో మాత్రం ఓ వ్యాపారం అయిపోయింది. ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన ఆ దేశం.. ఇతర దేశాల ముందుకు భిక్షం అడుకుంటుంటే..ప్రజలు అదే బాటలో పట్టారు.
ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం నిండా మునిగిపోయి.. సాయం కోసం ఇతర దేశాలను ప్రాధేయబడుతుంది. పాక్ ప్రభుత్వమే అనుకుంటే.. అక్కడి ప్రజలు కూడా భిక్షాటనే తమ వృత్తిగా మార్చుకుంటున్నారు. ఆ దేశంలో భిక్షాటన అనేది ఒక పెద్ద వ్యాపారంగా మారింది. పెద్ద, చిన్న నగరాలు అనే తేడా లేకుండా…అక్కడి ప్రజలు భిక్షం అనే బిజినెస్ ను సాగిస్తున్నారు. దేశం అనుకుంటే.. అక్కడి చాలా మంది ప్రజల పరిస్థితి కూడా భిక్షాటనేగా ఉంది. సరే ఇదంతా వారి దేశానికి చెందిన పరిస్థితులు, ఇతర ప్రభావం అనుకోవచ్చు. అంతటితో ఆగకుండా ఇతర దేశాలకు బిచ్చగాళ్లను ఎగుమతి చేస్తుంది.
ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ వంటి దేశాలకు వెళ్లే పాక్ ప్రజలు.. అక్కడ భిక్షాటన చేస్తున్నారు. బిచ్చమెత్తుకోవడం కోసమే పర్యాటక వీసాలతో పాక్ లోని చాలా మంది ప్రజలు సౌదీ అరేబియా దేశాలకు వెళ్తున్నారని వారి విదేశీ వ్యవహారాల శాఖే ఒప్పుకుంటోంది. ఇతర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తోన్న నేపథ్యంలో పాక్ ఈ విషయాన్ని ఒప్పుకుంది. యూఏఈ, ఇరాన్, ఇరాక్ వంటి దేశాలకు వెళ్లిన వాళ్లలో చాలామంది ఉపాధి కోసం ఏదో ఒక పనిచేసుకోకుండా.. బిచ్చమే వ్యాపారంగ రెచ్చిపోతున్నారు. 24 కోట్లకు పైగా జనాభా ఉన్న పాకిస్తాన్‌లో 3 కోట్ల మంది భిక్షాటనం చేస్తున్నారంటనే ఈ ఏ స్థాయిలో ఈ బిజినెస్ నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఇలా విదేశాలకు వెళ్లిన వాళ్లు ఈ ఆర్గనైజ్‌డ్ బెగ్గింగ్ ద్వారా వందల కోట్లు సంపాదించి.. తిరిగి తమ దేశంలో పెట్టుబడులు పెడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో సంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టెక్కించే ప్రయత్నం ఇలా జరుగుతోందనే ప్రచారం ఉంది. బిచ్చగాళ్ళు సంవత్సరానికి 42 బిలియన్ డాలర్లు సంపాదిస్తున్నారు. ఇది పాకిస్తాన్ జీడీపీలో 12శాతం కంటే ఎక్కువ అని అక్కడి అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఆర్థిక సంక్షోభంతో ఏమీ దిక్కులేని స్థితిలో బిచ్చమే దిక్కు అయింది. అదే దేశాన్ని నిలబెడుతుందన్న అంచనాలు ఉన్నాయి.
వైట్ కాలర్ క్యాండిడేట్స్ అంతా ఓ గ్యాంగ్‌ను తయారు చేసి భిక్షాటన చేసి సొమ్ము చేసుకుంటున్నారు. యాచకులకు రోజు గడవడంతో పాటు బెగ్గింగ్ ముఠా కోట్లకు పడగలెత్తున్నారు. దీంతో పాక్‌లో బిచ్చమెత్తుకోవడం అనేది ఉపాధి కల్పించే పరిశ్రమగా మారిపోయింది. ఇదే సమయంలో పాకిస్థాన్ కి ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తన ఫిర్యాదులు వస్తుండటంతో ఓ వైపు యాచకులను ఇతర దేశాలకు పంపిస్తూనే మరోవైపు బెగ్గర్స్ పై నిషేధం పేరుతో కొత్త రాగం ఎత్తుకుంది. మరి..పాక్ లో జరుగుతున్న ఈ నయ బిజినెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.