ఎంత గొప్పదానివి తల్లి.. పేదల కోసం రూ.224 కోట్ల రూపాయల ఆస్తులు దానం

సమాజంలోని అసమానతలు చూసి చలించిపోయిన ఓ శ్రీమంతురాలు.. తన యావదాస్తిని దానం చేయడానికి ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

సమాజంలోని అసమానతలు చూసి చలించిపోయిన ఓ శ్రీమంతురాలు.. తన యావదాస్తిని దానం చేయడానికి ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

మన దేశంలో రకరకాల మతాలు, కులాలు ఉంటాయి. వాటి ఆధారంగా మన సమాజంలో వివక్షలు కొనసాగుతున్నాయి. కానీ ప్రపంచాన్ని చూస్తే.. ఇక్కడ ఉండేవి రెండే కులాలు. ఒక్కటి ఉన్న వారు.. రెండు లేని వారు. డబ్బున్న వాడికి లోకం దాసోహం అవుతుంది. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు వాళ్ల కాళ్ల దగ్గరికే వస్తాయి. అదే పేదవారి పరిస్థితి చూస్తే.. తినడానికి కూడా తిండి లేక.. ఉండటానికి నివాసం లేక నానా ఇబ్బందులు పడుతుంటారు. ఉన్నవాళ్లు ఇంకా ఇంకా సంపాదించుకుంటుంటే.. లేనివాళ్లు మాత్రం.. ఇంకా ఇంకా దిగజారి పోతుంటారు. ఈ అసమానతలు తగ్గాలంటే.. మరి కొన్ని వందల ఏళ్లు పడుతుందేమో. అయితే ఈ పరిస్థితులు మార్చడానికి చాలా మంది బిలియనీర్లు వారి సంపదను దానం చేస్తుంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో సంపన్నురాలు వచ్చి చేరింది. సమాజంలోని ఉన్న అసమానతలు చూసిన చలించిన ఓ శ్రీమంతురాలు.. తన వద్ద ఉన్న వందల కోట్ల రూపాయల సంపదను దానం చేసింది. ఆ వివరాలు..

మన సమాజంలో చాలా మంది.. అది కూడా బాగా ఉన్న వాళ్లు.. తమదగ్గర ఉన్న సంపదను ఇతరులకు దానం చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. మరింత సంపదను పొగేసుకోవాలని భావిస్తారు. కానీ కొందరు మాత్రం సమాజం గురించి ఆలోచించి.. తమ సంపదను దానం చేయడానికి ముందుకు వస్తుంటారు. తాజాగా ఆస్ట్రియాకు చెందిన 31 ఏళ్ల మార్లిన్ ఎంగెల్‌హార్న్ అనే ఓ శ్రీమంతురాలు ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.

దేశంలోని ఆర్థిక అసమానతలు చూసి చలించిపోయిన ఎంగెల్‌హార్న్‌.. తన యావదాస్తిని సమాజం కోసం పంచిపెట్టింది. తన కుటుంబం నుంచి ఆమెకు వాసత్వంగా వచ్చిన రూ.220కిపైగా కోట్ల విలువైన ఆస్తులను వివిధ సంస్థలకు పునఃపంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. దేశంలోని పేద, ధనిక వర్గాల మధ్య అంతరం పెరిగిపోవడం ఆమెను కలచివేసింది. వాటిని తొలగించాలనే ఉద్దేశంతో.. తన దగ్గర ఉన్న సంపదను మొత్తం దానం చేయడానికి ముందుకు వచ్చింది.

ఆస్ట్రియాకు చెందిన 31 ఏళ్ల మార్లిన్ ఎంగెల్‌హార్న్.. ఓ సంపన్న పారిశ్రామిక కుటుంబంలో జన్మించించిది. దాంతో రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు వారసత్వంగా వచ్చాయి. అయితే వాటిని ఆమె తన స్వప్రయోజనాలకు వాడుకోలేదు. తన కళ్ల ముందు సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలను తొలగించడం కోసం తన యావదాస్తిని దానం చేసింది. ఇందుకోసం విభిన్న రంగాల నిపుణులతో కూడిన బృందం గుడ్ కౌన్సిల్ ఫర్ రీడిస్ట్రిబ్యూషన్ (గుటెర్‌ ర్యాట్‌) సంప్రదించిన తన ఆలోచనలను వారితో పంచుకుంది ఎంగెల్‌హార్న్‌. ఎంగెల్‌హార్న్‌ ఆలోచనలు విన్న ఆ బృందం.. సంపద పంపిణీ మేరకు ప్రణాళికలను రూపొందించి ఆమెకు అందజేశారు.

ఇక ఎంగెల్‌హార్న్‌.. మొత్తం సంపదను.. దాదాపు 77 సంస్థలకు పంచిపెట్టాలని నిపుణులు సూచించారు. ఈ జాబితాలో వాతావరణ మార్పులు, విద్య, ఆరోగ్యం, లింగ సమానత్వం కోసం కృషి చేసే సంస్థలు, మహిళలకు ఆశ్రయం కల్పించే కేంద్రాలు, నిరాశ్రయులు నడిపించే వార్తాపత్రికలు, అగ్నిమాపక విభాగాలు, ప్రజాస్వామ్య అనుకూల సంస్థలు ఉన్నాయి. అయితే, ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా దీర్ఘకాలిక వ్యవధిలో సాయంగా అందజేస్తామని తెలిపింది. ఒక్కో సంస్థకు 40 వేల నుంచి 1.5 మిలియన్ యూరోల వరకు (కనిష్ఠంగా రూ.36 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.13.5 కోట్లు) అందజేస్తామని వెల్లడించింది.

Show comments