iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు ప్రముఖ యూనివర్సిటీ బంపరాఫర్.. ఏకంగా 13 లక్షల స్కాలర్ షిప్

Aarhus University Scholarships: విద్యార్థులకు ప్రముఖ యూనివర్సిటీ గుడ్ న్యూస్ అందించింది. ఏకంగా 13 లక్షల వరకు స్కాలర్ షిప్ అందించనున్నది. దీనికి ఎవరు అర్హులు అంటే?

Aarhus University Scholarships: విద్యార్థులకు ప్రముఖ యూనివర్సిటీ గుడ్ న్యూస్ అందించింది. ఏకంగా 13 లక్షల వరకు స్కాలర్ షిప్ అందించనున్నది. దీనికి ఎవరు అర్హులు అంటే?

విద్యార్థులకు ప్రముఖ యూనివర్సిటీ బంపరాఫర్.. ఏకంగా 13 లక్షల స్కాలర్ షిప్

తల్లిదండ్రులు తమ పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. విద్యకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ఎంత కష్టమైనా సరే ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో చదివించేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. ఇటీవల ఫారిన్ ఎడ్యుకేషన్ కు ఆదరణ పెరిగింది. ప్రతిఏడు వందలాది మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను చదివేందుకు వెళ్తున్నారు. అయితే విదేశీ విద్య అనేది చాల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రయాణ ఛార్జీలు, యూనివర్సిటీ ఫీజులు, ఇతర ఖర్చులు కలుపుకుని తడిసి మోపెడవుతుంది. అయితే ఫారిన్ లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఆర్హుస్ యూనివర్సిటీ బంపరాఫర్ ఇచ్చింది. ఏకంగా 13 లక్షల వరకు స్కాలర్ షిప్ అందించడం ప్రారంభించింది.

విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే వారికి ప్రభుత్వాలు కూడా ఆర్థిక సాయం అందిస్తుంటాయి. అర్హతలను బట్టి విద్యార్థులకు స్కాలర్ షిప్స్ మంజూరు చేస్తుంటాయి. తాజాగా డెన్మార్క్‌లోని ఆర్హుస్ యూనివర్సిటీ కూడా ఫారిన్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్‌ అందజేసింది. ప్రతిభ గల విద్యార్థులకు మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌ కోసం స్కాలర్‌షిప్‌లు అందించడం ప్రారంభించింది. యూరప్‌కు వెళ్లిన విదేశీ విద్యార్థులు, మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకున్న వారు ఈ స్కాలర్‌షిప్స్‌ పొందేందుకు అర్హులు. విద్యార్థులు స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 15 2024 వరకు అవకాశం కల్పించారు.

అర్హుస్ యూనివర్సిటీ అందించే స్కాలర్ షిప్ పొందేందుకు విద్యార్థులు టోఫెల్ 83, ఐఎల్ట్స్‌ 6.5 లేదా కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ ఎగ్జామ్‌లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ 180 స్కోర్లు కలిగి ఉండాలి. కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, న్యూజిలాండ్, ఐర్లాండ్ లేదా యూఎస్‌ఏలోని యూనివర్సిటీల్లో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఎగ్జామ్స్‌ స్కోర్లు సాధించాల్సిన పనిలేదు. అభ్యర్థులు డెన్మార్క్ బ్యాచిలర్ డిగ్రీకి సమానమైన స్థాయి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. విద్యార్థులు పూర్తి వివరలతో అర్హుస్ యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.