Swetha
సాధారణంగా చంటి బిడ్డలను.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ నిమిషం కూడా వదిలి ఉండలేరు కన్న తల్లులు . అయితే, అమెరికాలో జరిగిన ఓ సంఘటన గురించి తెలుసుకుంటే మాత్రం.. ప్రపంచంలో ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతారు.
సాధారణంగా చంటి బిడ్డలను.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ నిమిషం కూడా వదిలి ఉండలేరు కన్న తల్లులు . అయితే, అమెరికాలో జరిగిన ఓ సంఘటన గురించి తెలుసుకుంటే మాత్రం.. ప్రపంచంలో ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతారు.
Swetha
ఓ ఫేమస్ సినిమాలో అమ్మ గురించి ఒక డైలాగ్ ఉంటుంది. “ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరు ఉండరు” అని.. అది వింటే అందరికి నిజమే కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మాతృత్వం అనేది ఓ వరం. ప్రపంచంలో మనుషుల దగ్గర నుంచి జంతువుల వరకు.. జన్మనిచ్చిన బిడ్డలను నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. కంటి పాపాల చూసుకుంటున్నారని అందరికి తెలిసిన విషయమే. అయితే, తాజాగా అమెరికాలో జరిగిన ఓ సంఘటన గురించి తెలిస్తే మాత్రం.. ప్రపంచంలో ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అని ఆశ్చర్య పోవాల్సిందే. ఎందుకంటే 16నెలల చంటి బిడ్డను ఒక్కదాన్నే వదిలేసి.. గదిలో బందించి .. ఆ తల్లి ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది. చివరకు ఆ బిడ్డ విగతజీవి అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ విషాద సంఘటన.. అమెరికాలోని ల్యాండ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ల్యాండ్ ప్రాంతానికి చెందిన క్రిస్టల్ కాంటే లారియో (32).. ఉన్నత సంపన్న కుటుంబంలో జన్మించింది. పుట్టుకతోనే ఈమె శ్రీమంతురాలు. దీనితో చిన్నతనం నుంచే ఈమెకు లగ్జరీగా బ్రతకడం అలవాటు. అయితే, ఈమెకు 16 నెలల జైలిన్ అనే పాప ఉంది. మరి, ఈమె భర్త ఉన్నాడో లేదో అనే విషయం అయితే తెలియదు. ఈమె తన కూతురితో కలిసి క్లీవ్ ల్యాండ్ ప్రాంతంలో ఒక విలాసవంతమైన ఇంట్లో ఉంటోంది. మొదట్లో కొన్ని నెలల పాటు పాపను ఆమె బాగానే చూసుకుంది. ఆ తర్వాత క్రిస్టల్ తన ఎంజాయిమెంట్స్ కు పాప అడ్డు అనుకుందో ఏమో తెలియదు కానీ.. కట్ చేస్తే .. 16 నెలల చంటి బిడ్డ అని కూడా చూడకుండా .. ఆ పాపాను ఒక్కదాన్నే ఇంట్లో వదిలిపెట్టి .. ఇంటికి తాళం వేసి.. డెట్రాయిట్ వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లి.. కనీసం ఇంట్లో పసికందు ఉందన్న సంగతి కూడా.. పట్టించుకోకుండా విహార యాత్రలు చేస్తూ.. పది రోజుల పాటు ఇంటి మీద ద్యాస లేకుండా తిరిగింది క్రిస్టల్.
ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగి వచ్చి చూడగా.. పాపా ఉయ్యాలలో ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది. వెంటనే ఆమె మళ్ళీ ఎమర్జెన్సీ నెంబర్ కు ఫోన్ చేయగా.. ఇంటికి వచ్చి చూసిన వైద్యులు .. ఆ పాపను చూసి.. చనిపోయిందని తేల్చి చెప్పారు. ఆ తర్వాత పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం చెప్పింది. ఇక ఆ తర్వాత క్రిస్టల్ ను పోలీసులు కోర్టులు హాజరు పరిచారు. కోర్టు వారు ఈ విషయం విని ఆశ్చర్యపోయి.. “ఇది మానవజాతి తలదించుకునే సంఘటన. ఒక మహిళ తన బిడ్డను ఇలా వదిలేసి వెళ్లడం బహుశా చరిత్రలోనే మొదటిసారి కావచ్చు. ఇలాంటి తప్పు మరో మహిళా చేయకూడదు. అందుకుగానూ కఠిన తీర్పు ఇస్తున్నాను. బెయిల్ అనేది లేకుండా ఈమెకు యావ జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాము.” అంటూ తీర్పును ఇచ్చింది. దీనితో విలాసాల కోసం కన్న బిడ్డనే కడుపున పెట్టుకున్న క్రిస్టల్.. కోర్టు ఆదేశం ప్రకారం జైలు జీవితాన్ని అనుభవిస్తోంది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.