ప్రేమకు కుల, మత, ప్రాంత భేదాలు ఉండవని మనం ఎన్నో జంటల ద్వారా తెలుసుకున్నాం. ఇక తాను ప్రేమించిన యువకుడు(యువతి)కోసం సరిహద్దులు దాటిన ప్రేమికులను ఇటీవలే చూశాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ప్రేమ మాత్రం వాటన్నింటిలోకెల్లా ప్రత్యేకమైనదని చెప్పుకోవాలి. 70 ఏళ్ల ఓ కెనడా బామ్మను 35 ఏళ్ల పాక్ కుర్రాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ వార్తతో ప్రపంచం మెుత్తం షాక్ కు గురైంది. అయితే ఈ పెళ్లిపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నాడు. కెనడా వీసా కోసమే అతడు ఈ పని చేశాడని కొందరు అంటే.. పేదరికంలో ఉన్న కారణంగానే ఈ పెళ్లి చేసుకున్నాడని మరికొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విచిత్రమైన లవ్ మ్యారేజ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అతడి పేరు నయీమ్ షాజాద్(35) పాక్ కుర్రాడు. ఆమె పేరు మేరీ(70) కెనడియన్ బామ్మ. వీరిద్దరు 2017లోనే పెళ్లి చేసుకున్నారు. అసలేం జరిగిందంటే? 2012లో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ఫేస్ బుక్ లో కలిశారు నయీమ్ షాజాద్, మేరి. అలా వారి మధ్య పరిచయం పెరిగి పెద్దదైంది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. 2015లో మేరీ అతడికి పెళ్లి ప్రపోజల్ పెట్టింది. ఆమె ప్రపోజల్ కు షాజాద్ కూడా అంగీకరించడంతో.. 2017లో వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే వీసా సమస్య కారణంగా ఇద్దరూ కలిసి కెనడాలో జీవించలేకపోయారు. కాగా.. ఇటీవలే మేరీ పాకిస్థాన్ ను సందర్శించి అతడి దగ్గర 6 నెలల పాటు ఉంది.
ఇక వీరి ప్రేమ పెళ్లిపై నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. షాజాద్ గతంలో ఆర్థికంగా, మానసికంగా చాలా కుంగిపోయి ఉన్నాడు. అప్పుడు మేరీ షాజాద్ కు అండగా నిలిచింది. ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా మానసిక ధైర్యాన్ని కూడా అందించింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? మేరీ ఏమీ ధనవంతురాలు కాదు. ఆమెకు వచ్చే పెన్షన్ తోనే ఆమె జీవిస్తోంది. ఇక ఈ ఆరోపణలన్నింటిని ఖండించాడు నయీమ్. ఇలాంటి విమర్శలను నేను పట్టించుకోనని, మేరీ తాను డిప్రెషన్ లో ఉన్నప్పుడు, డబ్బుతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఎంతో సాయం అందించింది. అందుకే నేను ఆమెతో ప్రేమలో పడ్డానని నయీమ్ తెలిపాడు. మరి విచిత్రమైన లవ్ మ్యారేజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.