iDreamPost

బ్రేకింగ్: దేశంలో అన్నీ  ఫోన్స్ కి ఒక్కసారిగా ఎమెర్జెన్సీ అలెర్ట్! కారణం? 

బ్రేకింగ్: దేశంలో అన్నీ  ఫోన్స్ కి ఒక్కసారిగా ఎమెర్జెన్సీ అలెర్ట్! కారణం? 

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటోంది. ప్రతి విషయానికి ఫోన్ మీద ఆధారపడాల్సిన పరిస్థుతులు ఉన్నాయి. ఏ కాస్త సమయం దొరికినా అందరూ తమ ఫోన్లలో తలలు పెట్టేస్తుంటారు. అయితే ఇప్పుడు అందరినీ ఒక మెసేజ్ కన్ఫ్యూజ్ చేస్తోంది. ఒక్కసారిగా అందరి ఫోన్లు మోగాయి. ఓపెన్ చేయగానే వార్నింగ్ అంటూ ఒక అలర్ట్ వచ్చింది. అది కూడా చాలా పెద్ద శబ్ధం చేస్తూ సందేశం వచ్చింది. అది చూసిన యూజర్లు అంతా కంగారు పడ్డారు. ఒకే దగ్గర ఉన్న అన్నీ ఫోన్లు ఒకేసారి మోగడంతో ఆశ్చర్యపోయారు.

ఈ మెసేజ్ లు అందుకున్న కొందరైతే తమ ఫోన్లు హ్యాక్ అయ్యాయి అంటూ కంగారు పడ్డారు. కానీ, అలాంటిది ఏమీ జరగలేదు. అది పాన్ ఇండియా అలర్ట్ సిస్టమ్ కి సంబంధించిన మెసేజ్. భవిష్యత్ లో రాబోయే విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు జరిగిన సమయంలో ప్రజలు అందరినీ ఒకేసారి అలర్ట్ చేసేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ టెస్ట్ చేస్తున్న ప్రక్రియ. ఆ మెసేజ్ లో కూడా అదే విషయం ఉంది. “ఇది ఒక టెస్టింగ్ శాంపిల్ మెసేజ్. కేంద్రానికి చెందిన సెల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ నుంచి వచ్చిన మెసేజ్ ఇది. ఈ మెసేజ్ కి సంబంధించి మీ వైపు నుంచి ఎలాంటి స్పందన అక్కర్లేదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అలెస్ట్ సిస్టమ్ ద్వారా ఈ మెసేజ్ టెస్ట్ చేయడం జరుగుతోంది.

Emergency alert to mobile phones

ఎమర్జెన్సీ సమయాల్లో ప్రజల యోగక్షేమాలు, వారి భద్రత కోసం ఈ మెసేజ్ లను పంపడం జరుగుతుంది” అంటూ ఆ మెసేజ్ లో ఉంది. అలాగే మీకు వైర్ లెస్ ఎమర్జెన్సీ సందేశాలు రావాలి అనుకుంటే YES నొక్కండి, వద్దు అనుకుంటే NO నొక్కండి అంటూ పాప్ అప్ అలర్ట్ కూడా వచ్చింది. మీరు ఎస్ నొక్కితే మీకు భవిష్యత్ లో అలాంటి అలర్ట్స్ వస్తాయి. అది ఇంగ్లీష్, తెలుగులో కూడా వచ్చాయి. ఈ టెస్టింగ్ మెసేజ్ అనేది నార్త్ లో అయితే 5 రోజుల క్రితమే జరిగింది. మనకు మాత్రం గురువారం టెస్ట్ చేశారు. కాబట్టి.. ఈ అలర్ట్ మీకు వస్తే ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి