8వ పెళ్లికి రెడీ అయిన 112 ఏళ్ల బామ్మ.. వరుడికో కండిషన్

పెళ్లి అంటే మనిషి జీవితంలో ఒక్కసారే జరిగే కీలక ఘట్టం. పురుషుడు అయితే రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉంది. మరీ మహిళ విషయంలో ఇది సాధ్యమా కానే కాదూ.. కానీ వీటికి చెక్ పెట్టేసింది ఆ మహిళ.. ఒకటి కాదు రెండు కాదూ.. ఏకంగా..

పెళ్లి అంటే మనిషి జీవితంలో ఒక్కసారే జరిగే కీలక ఘట్టం. పురుషుడు అయితే రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉంది. మరీ మహిళ విషయంలో ఇది సాధ్యమా కానే కాదూ.. కానీ వీటికి చెక్ పెట్టేసింది ఆ మహిళ.. ఒకటి కాదు రెండు కాదూ.. ఏకంగా..

‘మా చెల్లికి పెళ్లి..జరగాలి మళ్లీ మళ్లీ’ అని ఓ సినిమాలో తనికెళ్ల భరణి డైలాగ్ చెబితే నవ్వుకున్నాం. చెల్లికి మళ్లీ పెళ్లేంట్రా అనుకుని కడుపుబ్బా నవ్వుకున్నారు ప్రేక్షకులు. జీవితంలో ఒకసారే జరిగే మధుర ఘట్టాన్ని అలా జోక్ చేసి చూపించాడు దర్శకుడు. నిజమే మరీ పురుషుడు ఒకటి రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్నా యాక్సెప్ట్ చేస్తుంది కానీ ఈ సమాజం. ఒక మహిళకు భర్త మరణించినా, శాడిస్ట్ మొగుడై విడిపోయినా, లేకుంటే ఆమెను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయినా.. మగ తోడు లేకుండా భార్య మిగిలిన బతుకు ఈడ్చుకు రావాల్సిందే కానీ.. ఆమెకు మనస్సు ఉంటుంది, కోరికలు ఉంటాయన్న ఆలోచన చేయదు. తిరిగి ఆమె పెళ్లి చేసుకున్నా.. కలిసి జీవించినా.. ఆ మహిళను తిట్టిపోస్తుంది. వినలేని, భరించలేని మాటలు అంటూ ఉంటుంది.

కానీ ఓ మహిళ ఏకంగా 7 వివాహాలు చేసుకుని.. ఇప్పుడు ఎనిమిదో సారి కూడా పెళ్లి చేసుకోవాలని తన మనస్సులోని మాట బయట పెట్టింది. ఇన్ని పెళ్లిళ్లు అయ్యాయి అంటే సుమారు 50, 60 ఏళ్లు ఉంటాయనుకుంటున్నారేమో కానే కాదూ.. 112 ఏళ్ల పడుచు పిల్ల (బామ్మ) ఆమె. ఇంతకు ఆ బామ్మదీ ఎక్కడ అంటే మలేషియా. కెలాంతన్ రాష్ట్రంలోని తుంపట్ నగరంలో నివసిస్తోన్న సితి హవా హుస్సిన్ అనే బామ్మ.. పెళ్లికి వయస్సుతో సంబంధం లేదని నిరూపిస్తోంది. ఈ మహిళకు పెళ్లైన మనవళ్లు, మనవరాళ్లు ఉండటం విశేషం. మలేషియా వెబ్ సైట్స్ ప్రకారం.. 19 మంది మనవళ్లు, 30 మంది మనవరాళ్లు ఉన్నారు ఈ వృద్దురాలికి. ఆమె పెళ్లి చేసుకోవాలంటే ఓ కండిషన్ కూడా పెట్టిందండోయ్.

ఆమెను పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి ఈ బామ్మకు వచ్చి ప్రపోజ్ చేయాలి.. అలాంటి వ్యక్తినే తాను మనువాడతానని చెబుతోంది ఈ మహిళ. కాటికి కాళ్లు చాపే వయస్సులో ఇదేం కోరిక అని తీసిపారేయకండి. తనకు తోడు కావాలని భావిస్తోంది. తన మాజీ భర్తల్లో కొందరు చనిపోయారని, కొందరితో తనకు సంబంధాలు సరిగా లేవని, అందుకే విడిపోయామని చెప్పింది. 112 ఏళ్లు ఉన్నాయి కదా అనుకోకండి.. ఆమె ఆరోగ్యంగా ఉంది, ఆమె తన పని తానే స్వయంగా చేసుకుంటుంది. అయితే కాస్త కళ్లు మాత్రమే కనిపించడం లేదు. ప్రస్తుతం సితి హవా.. తన చిన్న కుమారుడు 58 ఏళ్ల అలీతో నివసిస్తోంది. అయితే ఇంత ఆరోగ్యవంతంగా ఉండటానికి సీక్రెట్ కూడా చెప్పారామే. సింప్లీ ఫుడ్ తింటుందట. తెల్లటి బియ్యం, నీరు మాత్రమే తాగి బతుకుతూ ఉందంట. రోజుకు ఐదు సార్లు నమాజ్ కూడా చేస్తోంది. మరీ లేటు వయస్సులో పెళ్లి చేసుకోవాలన్న ఆమె ఆలోచన పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments