Dharani
దిండు లేకపోతే నిద్ర పట్టట్లేదా.. అయితే మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొక తప్పదు అంటున్నారు నిపుణులు. తలగడ వాడటం వల్లే ఎలాంటి సమస్యలు వస్తాయంటే..
దిండు లేకపోతే నిద్ర పట్టట్లేదా.. అయితే మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొక తప్పదు అంటున్నారు నిపుణులు. తలగడ వాడటం వల్లే ఎలాంటి సమస్యలు వస్తాయంటే..
Dharani
ఎప్పుడు, ఎలా మన జీవితంలోకి వచ్చేసిందో తెలియదు కానీ.. నేటి కాలంలో తలగడ వాడకం తప్పనిసరి అయ్యింది. ప్రస్తుత కాలంలో చిన్నారులు సైతం దిండు లేకుండా నిద్ర పోలేకపోతున్నారు. ఇక కొందరైతే తల కింద రెండు, మూడు దిండ్లు పెట్టుకుని నిద్రపోతారు. ఏమాత్రం హైట్ తక్కువైనా.. సరిగా నిద్ర పోలేరు. నేటి జీవనశైలీలో దిండు వాడకం అనేది తప్పనిసరి అయ్యింది. మరి తలగడ వాడటం మంచిదేనా.. దీనివల్ల ఏమైనా సమస్యలు తలెత్తుతాయా.. అసలు దిండు వాడకం గురించి నిపుణులు ఏమంటున్నారంటే..
రాత్రిపూట నిద్రించేటప్పుడు చాలామంది తలకింద దిండు పెట్టుకొని నిద్రపోతారు. అయితే ఈ అలవాటు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఒకవేళ తప్పనిసరి అయితే.. తక్కువ ఎత్తు ఉన్న దిండు వినియోగిస్తే మంచిది అంటున్నారు. పెద్ద దిండు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయని అంటున్నారు. అయితే ఈ సమస్యలు ప్రారంభంలో తెలియదని.. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత నెమ్మదిగా ఒక్కో సమస్య వెలుగు చూస్తుందని అంటున్నారు. దీనిలో భాగంగా ముందుగా మెడ నొప్పి వస్తుందని.. ఈ సమస్య దీర్ఘకాలికంగా ఉంటుందని అంటున్నారు.
ఇక కొంతమందికి ఉదయం నిద్రలేవగానే వెన్నులో నొప్పితో బాధపడుతూ లేస్తారు. ఒకవేళ మీకు కూడా ఇలాంటి సమస్య ఎదురైతే పడుకునేటప్పుడు మీరు ఎత్తయిన దిండు ఉపయోగిస్తున్నారని అర్థం. దీనివల్ల వెన్నెముక వంగిపోతుంది. డిస్క్‌లలో దూరం పెరిగి వెన్నునొప్పి వస్తుంది. అందువల్ల దిండు లేకుండా నిద్రపోవడం అలవాటు చేసుకుంటే మంచిది అంటున్నారు నిపుణులు.
ఎత్తయిన దిండు పెట్టుకొని నిద్రపోతే తలకి రక్త ప్రసరణ సరిగా జరగదు. రాత్రిపూట చాలా గంటలు ఇలాగే ఉండటం వల్ల రక్త సరఫరా లేక జుట్టుకు సరైన పోషణ లభించదు. దీనివల్ల జుట్టు రాలే సమస్య ప్రారంభమవుతుంది. అంతేకాక తరచుగా తలనొప్పి వస్తుంది. లావుపాటి దిండు తలకింద పెట్టుకుని నిద్ర పోతే శరీరంలోని కొన్ని భాగాలకి రక్తం సరిగా సరఫరా కాక.. తిమ్మిర్ల సమస్య ఏర్పడుతుంది.
అందుకే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. తక్కువ ఎత్తు ఉండే చిన్న దిండుని ఉపయోగించాలి లేదంటే మెత్తటి టవల్ లేదా పలుచటి దుప్పటిని మడత పెట్టి తలకింద పెట్టుకోవడం ఉత్తమం. అంతేతప్ప.. లావు పాటి దిండ్లను వాడకూడదు అంటున్నారు నిపుణులు.