iDreamPost
android-app
ios-app

బియ్యం కడిగిన నీళ్లు పారబోస్తున్నారా? ఆ పని అస్సలు చేయకండి..ఎందుకో తెలుసా?

  • Published Nov 09, 2024 | 12:34 PM Updated Updated Nov 09, 2024 | 12:34 PM

Rice Water: దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వరి పంట సాగు చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ వారు ఎక్కువగా అన్నానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే మనం ప్రతిరోజూ కడిగి వృదాగా పారబోస్తున్న రైస్ వాటర్ లో ఎన్నో లాభాలు ఉన్నాయి.

Rice Water: దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వరి పంట సాగు చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ వారు ఎక్కువగా అన్నానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే మనం ప్రతిరోజూ కడిగి వృదాగా పారబోస్తున్న రైస్ వాటర్ లో ఎన్నో లాభాలు ఉన్నాయి.

  • Published Nov 09, 2024 | 12:34 PMUpdated Nov 09, 2024 | 12:34 PM
బియ్యం కడిగిన నీళ్లు పారబోస్తున్నారా? ఆ పని అస్సలు చేయకండి..ఎందుకో తెలుసా?

భారతీయులు భోజన ప్రియులు అన్న విషయం తెలిసిందే. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా అన్నానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే ఇక్కడ వరి సాగు ఎక్కువగా ఉంటుంది. అయితే చాలా మంది అన్నం వండేముందు బియ్యాన్ని ఒకటి రెండు సార్లు కడిగి సింక్ లో నీరు పారబోస్తుంటారు. బియ్యం కడిగిన నీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయన్న విషయం మీకు తెలుసా? వాటి వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా అన్నం వండే ముందు బియ్యాన్ని మంచినీటితో కడిగి శుభ్రం చేస్తారు. అయితే బియ్యం కడిగిన నీటిలో బోలెడన్ని విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

రైస్ వాటర్ లో అమైనో ఆమ్లాలు, విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి జుట్టుకు పట్టించి స్నానం చేస్తే కురులకు ఎంతో బలం. షాంపూ చేసిన తర్వాత బియ్యం నీటిని జుట్టుపై పోసి బాగా మసాజ్ చేసి కాసేపు అలాగే ఉంచండి. ఇలా చేయడం ద్వారా రైస్ వాటర్‌లోని పోషకాలు జుట్టును దృఢంగా చేయడంతో పాటు జుట్టు రాలే సమస్యను దూరం చేస్తుంది. బియ్యం కడిగిన నీటిలో కార్బొహైడ్రేడ్లు, ధాతువులు పుష్కలంగా ఉంటాయి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ జుట్టు పెరగడాన్ని గమనిస్తారు. మీ ముఖ వచ్ఛస్సు పెంచుకోవడానికి బియ్యం నీరు ఎంతో సహాయపడుతుంది. మొదట పీహెచ్ లెవల్ తక్కువగా ఉండే సబ్బుతో ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఒక కాటన్ తీసుకొని బియ్యం నీటిలో ముంచి మీ ముఖంపై మర్దన చేయండి. ఇలా 5 నిమిషాలు చేస్తే రైస్ వాటర్ లో ఉండే పోషకాలు ముఖంపై ఉన్న పోర్స్ ను తగ్గించడంతో పాటు మీ చర్మాన్ని మృదువుగా, అందంగా, ప్రకాశవంతంగా చేస్తుంది.

పొడి చర్మం ఉన్న వారికి బియ్యం నీరు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. స్నానం చేసే ముందు రైస్ వాటర్ ని కొంచెం బకెట్ లో కలపాలి. 10-15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత స్నానం చేస్తే చర్మానికి తేమను అందిస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మంపై దద్దుర్లు, మంట, ఎరుపుదనం వంటివి పోతాయి. అలాగే మచ్చలు, మొటిమలు దూరమవుతాయి. చర్మాన్ని ఎంతో మృదువుగా మారుస్తుంది.రోజుకోసారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మొక్కలకు అవసరమైన పోషకాలు రైస్ వాటర్ లో పుష్కలంగా ఉంటాయి. బియ్యం కడిగిన నీటిని మీ ఇండోర్, ఔట్ డోర్ మొక్కలకు పోయండి.. కొన్ని రోజుల్లో మార్పు గమనించండి. మీ మొక్కలు బలంగా, ఆరోగ్యంగా కనిపించడం మీరు గుర్తిస్తారు. ఇంట్లో పెంపుడు జంతువులకు తరుచూ రైస్ వాటర్ తాపించడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. వంటింట్లో సింక్ తదితర ప్రదేశాలను బియ్యం నీటితో శుభ్రం చేసుకోవచ్చు. ఇందుకోసం బియ్యం నీటిలో ఒక గుడ్డను ముంచి ఆ గుడ్డతో శుభ్రంగా తూడవాలి. బియ్యం నీటిలో ఆమ్లతత్వం ఉంటుంది. ఇది రసాయనాలు అవసరం లేకుండానే మొండి మరకలను సైతం శుభపర్చుతుంది. ఇకపై బియ్యం కడిగిన నీటిని సింక్ లో పారబోయకుండా వాడుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.