P Krishna
Cancer Causes: సాధారణంగా క్యాన్సర్ పేరు వినగానే ఎలాంటి వారైనా భయంతో వణికిపోతారు. క్యాన్సర్ దాదాపు వంద రకాల ఆర్గాన్స్ పై ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
Cancer Causes: సాధారణంగా క్యాన్సర్ పేరు వినగానే ఎలాంటి వారైనా భయంతో వణికిపోతారు. క్యాన్సర్ దాదాపు వంద రకాల ఆర్గాన్స్ పై ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
P Krishna
ప్రస్తుతం మారిన జీవన శైలి.. వివిధ రకాల ఆహారపు అలవాట్ల వలన పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా రక రాల క్యాన్సర్ల భారిన పడుతున్నారు. క్యాన్సర్ శరీరంలోని ఏ భాగానికైనా రావొచ్చు. ఈ క్యాన్సర్ దాదాపు వంద రకాల ఆర్గాన్స్ పై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. సాధారణంగా క్యాన్సర్ అనేది వంశపార్యంపరంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని.. సిగరెట్స్, ఆల్కాహల్ ఎక్కువగా వ్యాధి ప్రభావం ఎంతగా ఉందో అర్థమవుతుంది. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో విడుదలయ్యే రాడాన్ వాయువు వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా? దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
సాధారణంగా మన శరీరంలోని కణ విభజనలు ఒక క్రమ పద్దతిలో జరుగుతాయి. కొన్ని కారణాల వల్ల ఆ కణాల నియంత్రణ కోల్పోయి అతి వేగంగా విభజన చెంది కణ సమూహాలుగా ఏర్పడే స్థితినే క్యాన్సర్ అంటారు. మనిషికి క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు టొబాకో. సిగరెట్‌లో ఉండే కెమికల్ కార్సినోజెన్సీ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. సిగరెట్ పొగ పీల్చే సమయంలో కెమికల్స్ అన్నీ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అక్కడి సెల్స్ ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. దీని ప్రభావంతో లంగ్ క్యాన్సర్ వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే ఆల్కాహాల్ తీసుకున్న వాకిరి కొన్ని రకాల కెమికల్స్ అన్నవాహిక, పొట్ట భాగం, పెగులు లపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఆల్కాహాల్ వెంటనే బ్లెడ్ లో కలిసిపోతుంది. ఆల్కాహాల్ లో ఉండే కెమికల్ కార్సినోజెన్సీ ఊపిరి తిత్తులు, కిడ్నీ, లివర్ ఇతర అవయవాల మీద ప్రభావం చూపిస్తుందని వైద్యులు తెలిపారు.
ప్రముఖ బీబీసీ ఛానల్.. ప్రముఖ డాక్టర్ ని సంప్రదించగా పలు రకాల క్యాన్సర్ విషయాల గురించి వెల్లడించారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రేడాన్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఏవైనా పగుళ్లు ఉన్నా.. ప్లాస్టింగ్ పనులు సరిగా చేయకున్నా? ఇంటిలోపల ఏవైనా పగుళ్లు ఏర్పడితే అందులోకి రేడాన్ గ్యాస్ వెళ్తుంది. అలా చాలామంది తమకు తెలియకుండానే రేడాన్ గ్యాస్ పీల్చుతూ ఉంటారు. ఇది ఒక రకం కార్సినోజెన్సీ అంటారు. దీని ప్రభావం వల్ల ఎంతోమంది తమకు తెలియకుండానే వివిధ రకాల క్యాన్సర్ భారిన పడుతుంటారని వైద్యులు చెబుతున్నారు. దీన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకొని నివారించవొచ్చుని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో చాలా వరకు వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ రేడాన్ గ్యాస్ ఇంట్లోకి ప్రవేశించినా అది నేచర్ లో ఎక్కువగా కలిసిపోయే ఛాన్సు ఉంటుంది.
ఆడవాళ్లలో గర్భసంచి క్యాన్సర్, వోరల్ క్యాన్సర్ (నోటి క్యాన్సర్) లివర్ కి సంబంధించిన క్యాన్సర్లు అన్నీ కార్సినోజనీ వైరస్ వల్ల వస్తుంది. హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వల్ల క్యాన్సర్లు వస్తుంటాయి. ఈ వైరస్ కి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ప్లాస్టీక్ ఇండస్ట్రీస్ లో వాడే కెమికల్, పార్మసీ కంపెనీల్లో చేత్తో కొన్ని పదార్ధాలు మిక్స్ చేస్తుంటారు.. దాన్ని వాష్ చేసినా అలాగే ఉండిపోతుంది. సివిల్ కంపెనీల్లో పనిచేసేవాల్లకు కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. సిమెంట్ లో ఉండే దుమ్ములో కూడా క్యాన్సర్ ప్రభావితం చేసే కెమికల్స్ ఉంటాయని అంటున్నారు. ఇక వంశపార్యంపరంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
సాధ్యమైనంత వరకు సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింగ్ మనివేయాలి. బయటికి వెల్లే సమయంలో తప్పకుండా మాస్క్ ధరించాలి. ముఖ్యంగా సివిల్ కంపెనీల్లో అంటే సిమెంట్, బ్రిక్స్ పనులు చేసేవారు చాలా వరకు దుమ్మును పీల్చకుండా మాస్క్ ధరించాలి. ప్రస్తుతం ఎన్నో రకాల క్యాన్సర్ కి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. క్యాన్సర్ భారిన పడి మానసికంగా కృంగిపోకుండా దాన్ని ఎదిరించి పోరాడితే ఎలాంటి ప్రమాదం, ఇబ్బందులు ఉండవని డాక్టర్లు చెబుతున్నారు. క్యాన్సర్ భారిన పడే పదార్థాలు, వస్తువులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.