PCOD/ PCOS ఉన్న మహిళలకు ఈ ఆహార పదార్ధాలు విషంతో సమానం

PCOD/ PCOS ఇది టీనేజ్ గర్ల్స్ నుంచి మధ్య వయస్సు మహిళల వరకు ఎంతో మందిని వేధిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ను చూపిస్తూ ఉంటుంది. ఈ సమస్య ఉన్న వారు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా అది కేవలం టెంపరరీ సొల్యూషన్ మాత్రమే అవుతుంది. కానీ వారు తమ పట్ల స్పెషల్ కేర్ తీసుకుంటే మాత్రం శాశ్వతంగా ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది.

PCOD/ PCOS ఇది టీనేజ్ గర్ల్స్ నుంచి మధ్య వయస్సు మహిళల వరకు ఎంతో మందిని వేధిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ను చూపిస్తూ ఉంటుంది. ఈ సమస్య ఉన్న వారు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా అది కేవలం టెంపరరీ సొల్యూషన్ మాత్రమే అవుతుంది. కానీ వారు తమ పట్ల స్పెషల్ కేర్ తీసుకుంటే మాత్రం శాశ్వతంగా ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది.

PCOD/ PCOS ఇది టీనేజ్ గర్ల్స్ నుంచి మధ్య వయస్సు మహిళల వరకు ఎంతో మందిని వేధిస్తుంది. చెప్పుకునేంత పెద్దది కాదు తీసిపడేసే అంత చిన్నది కాదు. కానీ ఎంతో మంది అమ్మాయిలు దీని వలన చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నారు. ఈ సమస్య ఒక్కసారి వచ్చిందంటే చాలా కాలం వరకు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఎంతో మంది డాక్టర్స్ చుట్టూ తిరిగినా కానీ దీనికి దీర్ఘకాలీక పరిష్కారం దొరకక.. విసిగిపోయిన మహిళలు చాలా మంది ఉన్నారు. PCOD/ PCOS ఉన్న వారిలో ఆండ్రోజెన్ అనే మేల్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవే ఓవరీస్ మీద సిస్టుల్లాగా ఫార్మ్ అవుతూ ఉంటాయి. సాధారణంగా మహిళలలో ఆండ్రోజెన్‌ కంటే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉండాలి. కానీ కేవలం PCOD/ PCOS ఉన్న వారిలో మాత్రమే ఆండ్రోజెన్‌ ఎక్కువగా ఉంటుంది. దీనితో వారికి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. బరువు పెరగడం, జుట్టు రాలడం, మొటిమలు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్,  డయాబెటిస్‌, గుండె సమస్యలు, హైపర్‌టెన్షన్‌ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.పైగా ఇది అందరికి ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ను చూపిస్తూ ఉంటుంది. ఈ సమస్య ఉన్న వారు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా అది కేవలం టెంపరరీ సొల్యూషన్ మాత్రమే అవుతుంది. కానీ వారు తమ పట్ల స్పెషల్ కేర్ తీసుకుంటే మాత్రం శాశ్వతంగా ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. దానికోసం ముందుగా వారు ఇప్పుడు చెప్పుకోబోయే ఆహార పదార్ధాలను కచ్చితంగా మానేయాల్సి ఉంటుంది. ఓ రకంగా ఈ సమస్యతో బాధపడే వారికి ఈ ఫుడ్స్ విషంతో సమానం అని చెప్పి తీరాలి. ఆ ఆహార పదార్ధాలు ఏంటంటే..

1.ప్రాసెస్డ్‌ ఫుడ్స్:
అంటే రెడీమేడ్ గా దొరికే ఫుడ్స్. ఫ్యాక్‌ చేసిన స్నాక్స్‌, ఫ్రైడ్ ఫుడ్స్, మార్కెట్‌ – మేడ్‌ ఫుడ్స్‌ అసలు తినకూడదు. ఇలాంటివి తినడం వలన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి బదులుగా నట్స్ , డార్క్ చాక్లేట్లు , గుడ్డు , మొలకలు తీసుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

2. షుగర్:
సాధారణంగానే ఒక నెల రోజుల పాటు చెక్కరను దూరం పెడితే.. శరీరంలో చాలా రకాలా మార్పులు వస్తాయనే టాక్ ఉంది. ఇది చాలా మందికి వర్క్ అవుట్ అయింది కూడా. అలాంటిది PCOD ఉన్న వారు చెక్కరను దూరం పెడితే వారికి ఇంకాస్త ఎక్కువ లాభమే కలుగుతుందంట. షుగర్ లో సగం శాతం గ్లోకోజ్ ,సగం శాతం ప్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్‌ ఎక్కువగా తీసుకుంటే ఆ ఎఫెక్ట్ గట్‌ హెల్త్ మీద పడుతుంది. గట్‌ హెల్త్ దెబ్బతినడం PCOS ఉన్న వారికి అసలు మంచిది కాదు. కాబట్టి ఎంత వీలైతే అంత తీపి పదార్ధాలను దూరం పెడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

3.రెడ్ మీట్:
వీటిలో సరిపడా ప్రోటీన్స్ , కొవ్వు పదార్ధాలు అన్ని ఉంటాయి. అయినా సరే PCOS ఉన్న వారు వీటిని తీసుకోవడం అసలు మంచిది కాదట. ఎందుకంటే ఇవి శరీరంలో వాపు, ఇన్సులిన్ లక్షణాలను పెంచుతాయట. అందుకోసం వాటికి బదులుగా ఫ్రెష్ మీట్ ను తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

4.ఆల్కహాల్ :
ఈరోజుల్లో కొంతమంది టీనేజ్ గర్ల్స్ పార్టీలు , పబ్ లు అని తిరుగుతూ ఉండడం కామన్ అయిపొయింది. అది వారి వ్యక్తిగత విషయం. అయితే PCOS ఉన్న వారు మాత్రం ఆల్కహాల్ తాగితే ఈ లక్షణాలు మరింత పెరిగే అవకాశం ఉందట. ఆల్కహాల్ లివర్ ను ఎఫెక్ట్ చేయడమే కాకుండా.. బరువు పెరిగేలా కూడా చేస్తుంది. అప్పుడప్పుడు తీసుకున్నా కూడా ఈస్ట్రోజెన్-ప్రొజెస్టెరాన్ లెవెల్స్ అన్ బ్యాలెన్స్డ్ గా అవుతాయట. కాబట్టి PCOD/PCOS ఉన్న వారు ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది.

ఈ నాలుగు ఫుడ్స్ ను కనుక PCOD/PCOS సమస్య ఉన్న వారు అవాయిడ్ చేస్తే.. వారి ఆరోగ్య సమస్య త్వరగా తీరే అవకాశం ఉంది. అలాగే దీనితో పాటు ప్రతి రోజు వ్యాయామం , డైట్ కంట్రోల్ చేయడం వలన ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టె ఛాన్స్ ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments