Vinay Kola
Health: మనం తినే ఫుడ్ విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Health: మనం తినే ఫుడ్ విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Vinay Kola
ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో మనం ఏం తింటున్నామో? ఎలా తింటున్నామో? ఏ టైంకి తింటున్నామో? తెలీదు. మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఆహారం విషయంలో కచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం హెల్తీ ఫుడ్ తీసుకోవడమే కాదు సరైన సమయనికి కూడా ఆహారం తీసుకోవాలి. అలా తినకపోతే ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. సరైన సమయంలో ఆహారం తింటే..ఎలాంటి రోగాలు రావు. కాబట్టి ఇప్పుడు మనం ఏ ఆహారం ఏ టైమ్ కి తినాలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ముందుగా బ్రేక్ ఫాస్ట్ విషయానికి వస్తే.. మనం రెగ్యులర్ గా ఇడ్లీ, దోశ, పూరీ వంటి టేస్టీ ఫూడ్స్ ని పొద్దున్నే లాగించేస్తాం. బేసిగ్గా ఇవి చాలా రుచిగా ఉంటాయి కాబట్టి ఫుల్ గా తినేస్తామ్. తిన్న తరువాత ఏమాత్రం గ్యాప్ లేకుండా వేడి వేడి కాఫీ లేదా టీని ఆస్వాదిస్తూ తాగేస్తాము. కానీ బ్రేక్ ఫాస్ట్ ఇలా అస్సలు చేయకూడదు. బ్రేక్ ఫాస్ట్ కి ఫ్రూట్స్ తింటే చాలా బెస్ట్. అరటి పండు తినాలి. ఇది మనకు మంచి శక్తిని ఇస్తుంది. త్వరగా జీర్ణం అవుతుంది. ఉదయం 7 నుంచి 10 గంటలు లేదా 10 నుంచి 11 గంటల మధ్య 2 లేదా 3 అరటి పండులను తింటే చాలా మంచిది. మీరు అరటి పండుకి బదులు యాపిల్ లేదా జామ కాయ అయినా కూడా తినవచ్చు. వీటిని తిన్నాక పాలు కూడా తాగితే మరీ మంచిది. అయితే పాలు తాగాలనుకుంటే కేవలం ఉదయం 7 నుంచి 9 గంటల సమయంలో మాత్రమే తాగండి. ఇలా బ్రేక్ ఫాస్ట్ తీసుకున్నారంటే ఆరోజంతా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. చాలా మంది కూడా నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగేస్తారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ అలవాటు ఉంటే కచ్చితంగా మానేయండి. ఇక మధ్యాహ్నం టైమ్ లో లంచ్ కి మీరు ఏమి తిన్నా కానీ పెరుగు తినడం మాత్రం మరిచిపోవద్దు. లంచ్ మధ్యాహ్నం 12 నుంచి 3 లోపల తినడం మంచిది. పెరుగు జీర్ణ క్రియకి చాలా మంచిది. అలాగే సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్యలో మిక్స్డ్ నట్స్ అంటే బాదం, పిస్తా, జీడి పప్పు లేదా పల్లీలు స్నాక్స్ గా తీసుకుంటే మీ బాడీ చాలా స్ట్రాంగ్ అవుతుంది.
ఇక నైట్ డిన్నర్ 7 నుంచి 8 గంటల లోపే తినడం మంచిది. లంచ్ అయినా డిన్నర్ అయినా అన్నం తక్కువ కూర ఎక్కువ ఉండేలా చూసుకోండి. అంటే అన్నాన్ని పొడిగా కాకుండా కూర ఎక్కువగా కలుపుకొని తింటే అది త్వరగా జీర్ణం అవుతుంది. అన్నానికి బదులు రాగి సంగటి తింటే ఆరోగ్యానికి ఇంకా మంచిది. దీన్ని తినడం వలన షుగర్ సమస్య రాదు. లేదు మీకు రైస్ తినాలని ఉంటే పోలిష్ చేయని రైస్ మాత్రమే తినండి. ఇలా తింటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. ఏ జబ్బులు రావు. ఇక నైట్ డిన్నర్ అయ్యాక 9 నుంచి 11 గంటల టైమ్ లో పాలు తాగండి. ఎందుకంటే పాలు తాగడం వలన మీకు నిద్ర బాగా పడుతుంది. అలాగే అధిక ఆకలిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇక మీరు ఏ కూరలు వండుకున్నా కానీ మసాలాలు మితంగా మాత్రమే వేసుకోవాలి. స్పైసీ ఫుడ్ ఎప్పుడూ తినకూడదు. ఎక్కువగా తింటే బీపీ సమస్య వస్తుంది. కాబట్టి మితంగా మాత్రమే తినండి.
దీన్ని బట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం 7 నుంచి 9 గంటల సమయంలో అరటి, యాపిల్ లేదా జామకాయ తిని పాలు తాగాలి. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల సమయంలో పెరుగు తినాలి. సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్యలో జీడిపప్పు, బాదం పప్పు లేదా పల్లీలు తినాలి. ఇక రాత్రి 7 నుంచి 8 గంటల లోపు తక్కువ రైస్ లేదా రాగి సంగటి తినాలి. 9 నుంచి 11 గంటల సమయంలో ఒక గ్లాస్ పాలు తాగాలి. ఈ టైమ్ లో ఈ హెల్దీ డైట్ ని ఫాలో అయితే మీరు ఎలాంటి రోగాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.