Arjun Suravaram
Eat Food Before Brush Teeth: ప్రస్తుతం కాలం మారడంతో పాటు మనిషి ఆలోచనా తీరు, అలవాట్లలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అటువంటి వాటిల్లో పళ్లు, నోరు శుభ్రం చేసుకోకుండా నిద్ర లేచిన వెంటనే బెడ్ కాఫీ తాగడం. ఈవిషయం తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
Eat Food Before Brush Teeth: ప్రస్తుతం కాలం మారడంతో పాటు మనిషి ఆలోచనా తీరు, అలవాట్లలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అటువంటి వాటిల్లో పళ్లు, నోరు శుభ్రం చేసుకోకుండా నిద్ర లేచిన వెంటనే బెడ్ కాఫీ తాగడం. ఈవిషయం తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
Arjun Suravaram
ప్రస్తుతం ఎక్కువ మంది జీవితంల ఉరుకులు పరుగులు అన్నట్లు సాగుతుంది. జీతం కోసం వేటగా మారింది. ఈ క్రమంలోనే ఆరోగ్యాన్ని సైతం సరిగ్గా పట్టించుకోవడంలేదు. చాలా మంది ఉదయం లేవగానే బ్రష్ చేసి… తరువాత కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మరికొందరు మాత్రం బ్రష్ చేయకుండానే బెడ్ కాఫీ, బ్రేక్ ఫాస్ట చేస్తుంటారు. ఇలా చేయడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెబుతుంటారు. అలానే చాలా మంది వైద్య నిపుణులు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే దంతాలను, నోటిని శుభ్రం చేసుకోవాలని చెబుతుంటారు. కొందరు మాత్రం బ్రష్ చేయుకండా తినడం వలన కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
ప్రస్తుతం కాలం మారడంతో పాటు మనిషి ఆలోచనా తీరు, అలవాట్లలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అటువంటి వాటిల్లో పళ్లు, నోరు శుభ్రం చేసుకోకుండా నిద్ర లేచిన వెంటనే బెడ్ కాఫీ తాగడం. ఇదే చాలా దారుణం మనకుంటే మరికొందరు ఏకంగా టిఫిన్ కూడా తినేస్తున్నారు. ఇలా బ్రష్ చేయకుండా కాఫీ, టీలు తాగడం, బ్రేక్ పాస్ట్ చేయడం వలన తీవ్రమైన వ్యాధులబారిన పడతారని చాలా మందికి తెలిసింది. అలానే వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలను తప్పనిసరిగా బ్రష్ చేయించిన తరువాతనే మిగత పనులు చేయిస్తుంటారు. చాలా మంది బ్రష్ చేయకపోవడం కారణంగా అనారోగ్యంపాలైన ఘటనలు కూడా ఉన్నాయి. బ్రష్ చేయకుండా తినడం,తాగడం లాంటివి చేస్తే.. నోటిలోని క్రిములు శరీరంలోకి వెళ్లి అనారోగ్యాన్ని కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
అయితే తాజాగా ఈ విషయంలో కొందరు నిపుణులు చెప్పిన మాటలు అందరికి ఆశ్చర్యాని కలిగిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో బ్రష్ చేయకుండా తిన్నడం మంచిదేనా? అని అడిగిన ప్రశ్నలు ఆశ్చర్యాన్ని కలిగించే సమాధానం చెప్పారు. బ్రష్ చేయకుండా ఫుడ్ తీసుకోవడం కొన్ని సందర్భాల్లో మంచిదేనని చెబుతున్నారు. నోటిలోని ఉండే కొన్ని మంచి బ్యాక్టీరియాలు ఆరోగ్యానికి సాయపడతాయి. మనం తిన్న ఆహారాన్ని జీర్ణయం చేయడానికి అవి ఉపయోగపడుతాయి. మనం ఆహారం తిన్న తరువాత కొన్ని ముక్కలు పళ్ల మధ్యలో, నోటిలో ఉండిపోతాయి. అలాంటి సందర్భంగాలో బ్రష్ చేయకుండా తినడం అనేది మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి బ్రష్ చేసిన తరువాత తినడం, ఇతర పానీయాలు తీసుకోవడం అనేది మంచిదని చాలా మంది నిపుణలు చెబుతున్నమాట. మరి..తాజాగా ఈ నిపుణులు చెప్పిన ఈ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.