ఎన్ని మందులు వాడినా దగ్గు తగ్గడం లేదా.. ఈ చిట్కాలు పాటించండి

సీజన్‌ మారితే అనారోగ్య సమస్యలు చాలా కామన్‌. ఇలా తరచుగా వేధించే సమస్యల్లో దగ్గు ఒకటి. కొందరికి ఎన్ని మందులు వాడినా దగ్గు తగ్గదు. అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు..

సీజన్‌ మారితే అనారోగ్య సమస్యలు చాలా కామన్‌. ఇలా తరచుగా వేధించే సమస్యల్లో దగ్గు ఒకటి. కొందరికి ఎన్ని మందులు వాడినా దగ్గు తగ్గదు. అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు..

చలి, వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు సర్వ సాధారణం. మరీ ముఖ్యంగా శీతాకాలంలో దగ్గు సమస్యతో చాలా మంది బాధపడతారు. రిలీఫ్‌ కోసం మందులు, టానిక్‌లు వాడతారు. కానీ సమస్య తీవ్రత మాత్రం తగ్గదు. తాత్కలికంగా తగ్గినట్లు కనిపిస్తుంది.. మళ్లీ మళ్లీ తిరగబెడుతుంది. కాస్త చల్లగాలి తగిలినా.. ఊపిరి సలపకుండా దగ్గు వస్తుంది. చాలా మందికి పగటి పూట కాకుండా రాత్రి సమయాల్లో ఎడతెరపి లేని దగ్గుతో ఇబ్బంది పడతారు. కొందరికి ఎన్ని మందులు వాడినా దగ్గు తగ్గదు. మరి మీరు కూడా ఇలాంటి సమస్యతోనే బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు ఒకసారి పాటించి చూడండి. అవేంటి అంటే..

  • ఎడతెరపి లేని దగ్గుతో బాధపడేవాళ్లకు ఈ చిట్కా బాగా పనికి వస్తుంది. ఇందుకోసం నీళ్ళలో తులసి ఆకులు వేసి మరిగించి, ఆ తర్వాత మరిగిన తులసి నీటిని కాస్త చల్లార్చి తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది అంటున్నారు నిపుణులు.
  • అలానే పొడి దగ్గుతో బాధపడేవారికి కరక్కాయ ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు. పొడి తగ్గుతో బాధపడేవారు.. కొంచెం గోరువెచ్చని నీళ్లలో కరక్కాయ పొడిని కలుపుకుని తాగినా, కరక్కాయ ముక్క బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని మింగుతూ ఉన్నా ఉపశమనం లభిస్తుంది అంటున్నారు
  • అలానే అర టీ స్పూన్ సొంఠి పొడి లో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకున్నా దగ్గు నుంచి రిలీఫ్‌ లభిస్తుందని చెబుతున్నారు.
  • టీ స్పూన్‌ తేనెలో 1 టీ స్పూన్ అల్లం రసం, 1 టీ స్పూన్ దానిమ్మరసం మూడింటిని బాగా కలిపి తీసుకోవాలి. ఇలా రోజుకి 2 లేదా మూడు సార్లు చేస్తే చాలా మంచి ఫలితం కనిపిస్తుంది అంటున్నారు.
  • అలానే రెండు మిరియాల గింజలను బుగ్గన పెట్టుకుని.. నములుతూ ఆ రసం మింగాలి. ఇలా రెండు, మూడు రోజుల పాటు చేస్తే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది అంటున్నారు పండితులు.
Show comments