iDreamPost
android-app
ios-app

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు గుడ్ న్యూస్!.. ఇకపై అన్ని ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్స!

జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్.. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఇక నుంచి అన్ని రకాల ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స తీసుకోవచ్చని ప్రకటించింది.

జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్.. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఇక నుంచి అన్ని రకాల ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స తీసుకోవచ్చని ప్రకటించింది.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు గుడ్ న్యూస్!.. ఇకపై అన్ని ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్స!

ప్రస్తుత కాలంలో మానవ జీవన శైలిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు ఇలా అన్నీ కలుషితమవుతుండడంతో ప్రజలు రోగాల భారిన పడుతున్నారు. అంతేగాక వాతావరణంలో మార్పుల కారణంగా వివిధ రకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఇలాంటి విపత్కర సమయాల్లో హాస్పిటల్ బిల్లులు భారంగా మారకుండా ఉండేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటున్నారు చాలా మంది. పలు రకాల కంపెనీలు ఆరోగ్య బీమాలను కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్.. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఇక నుంచి అన్ని రకాల ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స తీసుకోవచ్చని ప్రకటించింది.

ఆరోగ్య బీమా అనేది ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీదారుడు జబ్బున పడ్డప్పుడు వైద్యానికయ్యే ఖర్చులను చెల్లిస్తుంది. ఆరోగ్య బీమా ఆపద సమయంలో ఆర్థిక భారం పడకుండా రక్షిస్తుంది. కాగా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్లైతే మీకు ఇది శుభవార్తే అని చెప్పాలి. ఇకపై దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స తీసుకోవచ్చు. గురువారం నుంచే ఈ సదుపాయం ఆరోగ్య బీమా పాలసీదారులకు అందుబాటులోకి వచ్చినట్లు ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తెలిపింది. కాగా పాలసీదారులు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పటికీ.. అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ సదుపాయం ఉండదు. కానీ ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ చేసిన తాజా ప్రకటనతో ఇకపై అన్ని ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ పొందొచ్చు.

Good news for health insurance policyholders

ఇప్పటి వరకు ఆరోగ్య బీమా పాలసీదారులు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ సదుపాయం పొందాలంటే ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలు ఒప్పందం చేసుకున్న ఆసుపత్రుల్లో మాత్రమే సాధ్యమయ్యేది. నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీదారులకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ సదుపాయం ఉంటుంది. ఆరోగ్య బీమా కంపెనీల లిస్టులో లేని ఆసుపత్రుల్లో ట్రీట్‌మెంట్ తీసుకోవాలంటే రోగులు ముందుగా డబ్బు చెల్లించాలి. ఆ తర్వాత మెడికల్ బిల్లుల్ని, సంబంధిత వివరాలతో కూడిన డాక్యుమెంట్లను కంపెనీకి సమర్పించి రీయింబర్స్‌మెంట్ పొందాల్సి ఉంటుంది. అయితే దీనికి సమయం ఎక్కువ పడుతుండడంతో పాటు కంపెనీలు నిబంధనల పేరిట తిరస్కరించే అవకాశం కూడా ఉంది. దీంతో పాలసీదారులు నష్టపోయే ప్రమాదం ఉంది.

ఇక కొత్త నిబంధనల ప్రకారం ఈ సమస్యలకు చెక్ పడినట్లే. ఇకపై ఏ ఆసుపత్రిలోనైనా క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పొందొచ్చు. అయితే నెట్‌వర్క్ హాస్పిటల్ లిస్టులో లేని ఆస్పత్రిలో క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పొందేందుకు 48 గంటల ముందే ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. అత్యవసర పరిస్థితుల్లో అయితే.. ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లోగా సమాచారం అందించాల్సి ఉంటుంది. అనంతరం ఇన్సూరెన్స్ కంపెనీల రూల్స్ ప్రకారం పాలసీదారులు అన్ని రకాల బిల్స్, సంబంధిత పత్రాలను సమర్పించి క్లెయిమ్ చేసుకోవచ్చు. మరి ఆరోగ్య బీమా పాలసీదారులకు అన్ని రకాల ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్సలు అందించే అవకాశం కల్పించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.