Uppula Naresh
Uppula Naresh
ఈ రోజుల్లో చాలా మంది కాఫీ, టీ తాగడం మానేసి గ్రీన్ టీ తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇది తాగడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలియడంతో అందరూ గ్రీన్ టీ తాగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గ్రీన్ టీ ఎప్పుడు తాగాలని చాలా మందికి తెలియదు. దీంతో కొందరు ఎప్పడు పడితే అప్పుడు తాగుతున్నారు. గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? దీన్ని ఏ సమయంలో తాగాలి? అసలు పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది గ్రీన్ టీ తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆది తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, తాగితే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అసలు నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దీంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు, ప్రొస్టెట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. అయితే చాలా మందికి గ్రీన్ టీని ఏ టైమ్ లో తాగాలని తెలియదు. నిపుణుల ప్రకారం.. భోజనానికి గంట ముందు తాగితే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.