iDreamPost

నిరుద్యోగులకు రూ.50 లక్షల లోన్.. ఎలా పొందాలంటే?

నిరుద్యోగులకు రూ.50 లక్షల లోన్.. ఎలా పొందాలంటే?

ఈ రోజుల్లో టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన చాలా మంది యువత ఉద్యోగాలు లేక ఇంటి వద్దే ఉంటున్నారు. చదువుకున్న చదువుకి ఏ మాత్రం సంబంధం లేని పని చేస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరికొందరు మాత్రం.. పని చేయాలన్న ఉత్సహం ఉండి ఆర్థిక సమస్యలతో ఇబ్బందుతన్న పడుతున్న వారు కూడా ఎంతో మంది. అయితే అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.50 లక్షల లోన్ ఇస్తోంది. అసలు ఈ లోన్ ఎవరికి ఇస్తారు? ఎలా పోందాలి? ఏమైనా సబ్సిడి ఉందా అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను అందించింది. యువతకు స్వయం ఉపాధి కోసం ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) ద్వారా నిరుగ్యోలకు ఏకంగా రూ.50 వరకు లోన్ ఇస్తోంది. అయితే ఇందులో 35 శాతం సబ్సిడీ కూడా ఉండడం విశేషం. ఇక ఈ లోన్ పొందాలనే నిరుద్యోగ యువత.. https://kviconline.gov.in/ వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలు పొందుపరచాలి. మరో విషయం ఏంటంటే? ఈ లోన్ పొందాలనుకునేవారు కనీసం 8వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇంతే కాకుండా 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న నిరుద్యోగులు ఈ లోన్ కు అప్లయ్ చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాల కోసం https://kviconline.gov.in/ వెబ్ సైట్ లాగిన్ అయి వివరాలు పొందండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి