SNP
Astrazeneca, Covishield Vaccine: కరోనా నుంచి రక్షణ కోసం వేయించుకున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలిసిన నేపథ్యంలో ఆ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా ఓ కీలక ప్రకటన చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Astrazeneca, Covishield Vaccine: కరోనా నుంచి రక్షణ కోసం వేయించుకున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలిసిన నేపథ్యంలో ఆ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా ఓ కీలక ప్రకటన చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
గత రెండు రోజులుగా కోవిషీల్డ్ గురించి వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అందుకు కారణం.. కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డ కట్టడం వంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని స్వయంగా ఆ టీకా తయారు చేసిన కంపెనీ అయిన ఆస్ట్రాజెనెకా అంగీకరించడమే. అది కూడా కోర్టు ముందు నిజం ఒప్పుకోవడంతో.. ఆ టీకా వేయించుకున్న వారిలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా కంపెనీ తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. కరోనా సమయంలో ఇండియాలో చాలా మందికి కోవిషీల్డ్ వ్యాక్సినే వేశారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఈ టీకాలు వేసింది. కరోనా మహమ్మారి నుంచి బతికి బట్టకట్టేందుకు దేశ పౌరుల్లో చాలా మంది టీకాలు వేయించుకున్నారు.
అయితే.. కరోనా తగ్గిన తర్వాత.. గుండెపోటు మరణాలు ఎక్కువ అయ్యాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు, వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారని, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కొన్ని అధ్యయానాలు వెల్లడించాయి. అయితే.. ఇప్పుడు ఏకంగా కోవిషీల్డ్‌తో రక్తం గడ్డకట్డం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని.. ఆ టీకా తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా బ్రిటన్ కోర్టుకు నివేదిక సమర్పించడంతో ఒక్కసారిగా కోవిషీల్డ్ తీసుకున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. అయితే.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సురక్షితమైందే అని, తమ వ్యాక్సిన్ వేయించుకున్న వారు ఎలాంటి కంగారుకు, భయానికి గురి కావాల్సిన అవసరం లేదని తాజాగా ఆస్ట్రాజెనెకా ప్రకటన విడుదల చేసింది.
తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎన్నో ప్రమాణాలతో కూడిన ప్రయోగ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిందని, అందుకోసం వ్యాక్సిన్ వేయించుకున్న వారెవరూ భయపడాల్సిన పనిలేదని ధైర్యం చెప్పింది. కాగా, కోవిషీల్డ్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని విషయం బయటికి రాగానే.. చాలా వార్తలు, భయం పుట్టించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. ఆస్ట్రాజెనెకా కోర్టుకు సమర్పించిన నివేదికలో అరుదైన సందర్భాల్లో మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతి ఒక్కరిలో అలాంటి దుష్ఫలితాలు ఉండవని పేర్కొంది. కాగా, ఈ కోవిషీల్డ్ టీకాను ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయక్తగా తయారు చేసి.. మన దేశంలోని పుణేలో గల సీరమ్ ఇనిస్టిట్యూట్‌లో ఉత్పత్తి చేసిన విషయం తెలిసిందే. మరి కోవిషీల్డ్ టీకా వేయించుకున్న వారు కంగారు పడొద్దని కంపెనీ చేసిన ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Real-world evidence continues to highlight the ongoing impact of COVID-19 for immunocompromised patients. Reinforcing that they carry a disproportionately large share of the disease impact compared to the general population. Learn more: https://t.co/Wq43AoNwa5 #ECCMID2024 pic.twitter.com/ag7ctDVmUG
— AstraZeneca (@AstraZeneca) April 29, 2024