iDreamPost
android-app
ios-app

EPFO: సడెన్‌గా మారిన PF రూల్స్‌.. ఇక ఆ డబ్బులు తీసుకోలేరు

  • Published Jun 14, 2024 | 3:13 PM Updated Updated Jun 14, 2024 | 3:13 PM

ఉద్యోగులు భవిష్యనిధి సంస్థ సడెన్‌గా కొన్ని రూల్స్‌ మార్చింది. ఫలితంగా ఉద్యోగులు ఆ డబ్బులు తీసుకోలేరు. ఇంతకు ఏ నియమాలు మార్చింది అంటే..

ఉద్యోగులు భవిష్యనిధి సంస్థ సడెన్‌గా కొన్ని రూల్స్‌ మార్చింది. ఫలితంగా ఉద్యోగులు ఆ డబ్బులు తీసుకోలేరు. ఇంతకు ఏ నియమాలు మార్చింది అంటే..

  • Published Jun 14, 2024 | 3:13 PMUpdated Jun 14, 2024 | 3:13 PM
EPFO: సడెన్‌గా మారిన PF రూల్స్‌.. ఇక ఆ డబ్బులు తీసుకోలేరు

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ.. ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ ఈపీఎఫ్‌ఓ ఉద్యోగులకు సడెన్‌గా షాక్‌ ఇచ్చింది. ఉన్నట్లుండి కొన్ని రూల్స్‌ని మార్చేసింది. దీని వల్ల ఉద్యోగులు ఇబ్బంది ఎదుర్కొనున్నారు. సాధారణంగా పీఎఫ్‌ నగదు అంటేనే అనుకోని అవసరాల వేళ.. భవిష్యత్తు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని చేసే పొదుపు. అనారోగ్యం, పిల్లల చదువు, వివాహం వేళ ఆ మొత్తం పనికి వస్తుందని చాలా మంది భావిస్తారు. ఈ క్రమంలో తాజాగా ఈపీఎఫ్‌ఓ అకస్మాత్తుగా కొత్త నియమాలను అమల్లోకి తెచ్చింది. దీని వల్ల ఉద్యోగులు ఆ డబ్బులు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇంతకు పీఎఫ్‌ తీసుకువచ్చిన కొత్త రూల్స్‌ ఏంటి.. అవి ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి అంటే..

కరోనా విజృంభిస్తోన్న సమయంలో అడ్వాన్స్‌ ఫెసిలిటీలో భాగంగా డబ్బులు విత్‌ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఉద్యోగుల ఆరోగ్య అవసరాల కోసం ఈపీఎఫ్ఓ ఈ నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ సదుపాయం తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా.. కరోనా సమయంలో మొత్తం రెండు సార్లు డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మొదట కోవిడ్‌- 19 విజృంభించినప్పుడు ఒకసారి.. ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మరోసారి ఇలా మొత్తం రెండు సార్లు చందాదారులు.. తమ తమ పీఎఫ్ డిపాజిట్ల నుంచి నగదు తీసుకునే ఛాన్స్ కల్పించింది.

PF money

చాలా మంది కరోనా సమయంలో ఉద్యోగానికి వెళ్లలేని వారు, చేతిలో డబ్బుల్లేని వారు ఈకోవిడ్- 19 పీఎఫ్ అడ్వాన్స్ సేవల్ని వినియోగించుకున్నారు. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) 2020 మార్చిలో తొలిసారిగా పీఎఫ్ అకౌంట్ల నుంచి ఇలా కోవిడ్ అడ్వాన్స్ కింద డబ్బులు తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. 2021లో మరోసారి కరోనా విజృంభించగా రెండో ఛాన్స్ ఇచ్చింది. అయితే తాజాగా ఈపీఎఫ్‌ ఈ సదుపాయాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించిది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ 2024, జూన్ 12న ఒక సర్క్యులర్ విడుదల చేసింది. కోవిడ్-19 మహమ్మారి కాదని ఈ సందర్భంగా పేర్కొంది.

ఈ అడ్వాన్స్ ఫెసిలిటీ కింద అప్పట్లో ఈపీఎఫ్ఓ.. పీఎఫ్ అకౌంట్లో ఉన్న మొత్తం నగదులో 75 శాతం లేదా ఉద్యోగుల 3 నెలల కనీసం వేతనం, డీఏ.. దీంట్లో ఏది తక్కువైతే అంత మొత్తం తీసుకునేందుకు అవకాశం కల్పిస్తూ.. ఓ నిబంధన తీసుకొచ్చింది. చందాదారుల అవసరాలకు అనుగుణంగా.. అంతకంటే తక్కువ మొత్తం కూడా తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో దాన్ని రద్దు చేసింది.

పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునేందుకు అనేక రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వైద్య అవసరాలు, వివాహం, హౌసింగ్, పిల్లల చదువు ఇలా వేర్వేరు అవసరాలకు అకౌంట్ నుంచి గరిష్టంగా రూ. లక్ష వరకు విత్‌డ్రా చేసుకునే ఆప్షన్ ఉంది. ఇక ఇటీవల దీనిని ఆటో సెటిల్మెంట్ కిందకు తీసుకొచ్చింది. అంటే కేవలం 3 రోజుల్లోనే సదరు డబ్బులు అకౌంట్లో పడతాయన్నమాట. కానీ ఇప్పుడు పూర్తిగా తొలగించింది.