Uppula Naresh
చాలా మంది రోజు మూడు పూటలా వైట్ రైస్ తింటూ ఉంటారు. అలా ఎక్కువ సార్లు అన్నం తినడం వల్ల ఈ రకమైన సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అదేంటంటే?
చాలా మంది రోజు మూడు పూటలా వైట్ రైస్ తింటూ ఉంటారు. అలా ఎక్కువ సార్లు అన్నం తినడం వల్ల ఈ రకమైన సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అదేంటంటే?
Uppula Naresh
దేశ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల ప్రజలు అధికంగా మూడు పూటల అన్నమే తింటుంటారు. అయితే. నగరాల్లో జీవించే ప్రజలు మాత్రం ఉదయం పూట టిఫిన్ చేస్తూ మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో అన్నంతో సరిపెడుతుంటారు. కానీ, కొంతమంది మాత్రం అన్నం తినకుండా మరొకటి తింటే అస్సలు తిన్నట్లు కూడా ఉండదని చెబుతుంటారు. ఇక ప్రాంతాలను బట్టి ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. కానీ, మూడు పూటలా అన్నం తినడం వల్ల చాలా రకాల దుష్పలితాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. అందులో ఎలాంటి పోషకాలు ఉండకపోగా.. ప్రయోజనం కూడా ఉండదని చెబుతున్నారు. మూడు పూటలా అన్నం ఎందుకు తినకూడదు? తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది? అసలు నిపుణులు ఏం చెబుతున్నారంటే?
పోషకాహార నిపుణుల ప్రకారం.. చాలా ప్రాంతాల్లో ప్రజలు మూడు పూటలా వైట్ రైస్ తింటుంటారు. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ప్రజలు అన్నం లేకుండా అస్సలు ఉండలేరనేది వాస్తవం. ఇక నగరాల్లో నివసించే వాళ్లు ఉదయం టిఫిన్ చేస్తూ మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో అన్నంతో కడుపు నింపుకుంటున్నారు. అయితే, బియ్యంతో తయారు చేసిన ఆహార పదార్థాలు తక్షణ శక్తిని మాత్రమే అందిస్తాయట. కానీ, రోజులో మూడు పూటలా అన్నం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కొందరు పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇంతే కాకుండా ప్రతీసారి వైట్ రైస్ తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఆస్కారం ఉన్నట్లు చెబుతున్నారు. ఇకపోతే.. తిన్న ఆహారం జీర్ణం కావాలంటే పీచు పదార్థాలు కలిగిన ఆహారం తీసుకోవాలంటున్నారు.
ఇందులో ప్రధానంగా జొన్నలు, గొదుమలు, పప్పు దినుసులు, కూరగాయలతో పాటు మినుమలను భోజనంలో చేర్చుకోవాలి. దీంతో మలబద్దక సమస్య అస్సలు దరిచేరదు. ఇలాంటి పోషక పదార్థాలు కాకుండా ప్రతీసారి అన్నం తినకూడదని సూచిస్తున్నారు. ఇకపోతే, వైట్ రైస్ లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇంతే కాకుండా క్యాలరీలు ఎక్కువగా ఉన్న తెల్ల అన్నం తినడం వల్ల నడుము చుట్టు కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా బరువు పెరగడంతో పాటు రక్తంలో చెక్కర స్థాయిలు కూడా క్రమంగా పెరుగుతాయి. దీంతో రోగ నిరోధక శక్తి తగ్గుతూ అనారోగ్య సమస్యలకు గురి కావాల్సి వస్తుంది. మరో విషయం ఏంటంటే? మధుమేహం ఉన్న వ్యక్తులు మాత్రం ఈ వైట్ రైస్ ను అస్సలు తినకూడదని సూచిస్తున్నారు నిపుణులు. ఇలా మూడు పూటలా అన్నం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేకపోవడంతో పాటు నష్టాలు కూడా పొంచి ఉన్నాయని.. ఇక అన్నం తినడం కాస్త తగ్గించి పీచు పదార్థాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.