లొట్టేలేసుకుని మరీ పానీపూరి తింటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త

సౌత్ ఇండియన్ ఫేమస్ ఫుడ్ బిర్యానీని నార్త్ ఇండియన్స్ ఇష్టపడుతున్నట్లే.. ఉత్తరాది ప్రాంతాల నుండి వచ్చిన ఓ తినుబండారాన్ని దక్షిణాది ప్రాంతాల ప్రజలు ఓన్ చేసుకున్నారు. అదే పానీ పూరి. చెప్పగానే నోరూరుతుంది కదా. అయితే ఆగండి.. ఇది చదివి వెళ్లండి

సౌత్ ఇండియన్ ఫేమస్ ఫుడ్ బిర్యానీని నార్త్ ఇండియన్స్ ఇష్టపడుతున్నట్లే.. ఉత్తరాది ప్రాంతాల నుండి వచ్చిన ఓ తినుబండారాన్ని దక్షిణాది ప్రాంతాల ప్రజలు ఓన్ చేసుకున్నారు. అదే పానీ పూరి. చెప్పగానే నోరూరుతుంది కదా. అయితే ఆగండి.. ఇది చదివి వెళ్లండి

ఏదైనా తిందామని సాయంత్రం పూట అలా రోడ్డు మీదకు అలా వెళ్లగానే ఓ సైడ్ కనిపిస్తూ ఉంటుంది పానీ పూరి బండి. జనాలు ఉన్నప్పటికీ.. గబుక్కున వెళ్లి ఓ ప్లేట్ పానీ పూరి ఆర్డర్ చెప్పేస్తుంటాం. అప్పటికే చాలా మంది వెయిటింగ్‌లో ఉంటారు. పానీ పూరీ బండి అమ్మే వ్యక్తి.. అందరికీ ప్లేట్ లేదా బౌల్ ఇస్తాడు. వెంటనే ఉల్లిపాయ ముక్కలు పడతాయి. ఆ తర్వాత కవర్‌లో నుండి పానీ పూరి తీసి, దానికి టుపుక్కు అని రంధ్రం చేసి.. పెయ్యి మీద పెద్ద పెనంపై ఉన్న పప్పు మిశ్రమాన్ని అందులోకి కూరి, ఆ పక్కనే పెద్ద బిందెలో ఉన్న వాటర్‌లో ముంచి మనకు సర్వ్ చేస్తాడు. మన వాటా వచ్చేంత వరకు వెయిట్ చేసి.. పానీ పూరి పడగానే, మళ్లీ ఎవరో లాగేసుకుంటారన్న భయంతో గుటుక్కున మింగేస్తాం.

అంతలో గుంపులో నుండి ఎవరో ఒకరు ‘భయ్యా, తోడా ప్యాస్ దాలో’ అంటారు. అదే వరుసలో అందరు గొంతు కలిపి.. మళ్లీ ఉల్లిపాయలు వేసుకుంటారు. ఒకటి, రెండు ప్లేట్లు తిన్నాక, చివరకు ఓ ప్లేటులో పానీ పూరి నీళ్లు పోసుకుని జుర్రేస్తుంటాం. ఆ తర్వాత ఓ తేపు తేపి వెళ్లిపోతుంటాం. నిత్యం పానీ పూరి బండ్ల దగ్గర ఇదేగా జరిగేది. ఈ పానీ పూరి ప్రియులకు ఓ పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది. పానీ పూరీ నీళ్లు.. అమృతంలా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త. ఆ నీళ్లల్లో చింత పండు రసానికి బదులు, యాసిడ్ కలుపుతున్నారట. నీటిలో యాసిడ్ కలపడం వల్లే దాని రుచి పెరిగిందని, దీంతో ఈ పదార్ధానికి మరింత ఎడిక్ట్ అయ్యారని అధికారులే స్వయంగా వెల్లడించడం గమనార్హం.

 

మరీ పానీపూరీ నీళ్లల్లో యాసిడ్ కలిసిందని ఎలా తెలుసుకోవాలబ్బా అని ఆలోచిస్తున్నారా..? పానీ పూరి నీటి రంగు ముదరు రంగులో కాకుండా తేలికగా మారితే.. నీటిలో యాసిడ్ కలిపారని అర్థమట. స్టీల్ బౌల్‌లో దీన్ని పోసి చూస్తే.. అంచుల చుట్టు మచ్చలు ఏర్పడతాయి. ఇలా కూడా కనిపెట్టలేకపోతే.. అబ్జర్వేషన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. తాగేటప్పుడు గొంతులో మంట, చికాకు, అలాగే కడుపులో మంట లక్షణాలు కనిపిస్తుంటే అనుమానించాల్సిందే. వాంతులు, వికారం అనిపించినా వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది. ఇతరులను కూడా అలర్ట్ చెయ్యాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు పానీ పూరీలాంటి పదార్థాలకు దూరంగా ఉంచడం మంచిది అంటున్నారు నిపుణులు.

Show comments