iDreamPost
android-app
ios-app

లేటెస్ట్ ఫోటో షూట్ తో అదరకొడుతున్న పాయల్! ఫొటోలు వైరల్..

  • Author Soma Sekhar Updated - 05:51 PM, Fri - 21 July 23
  • Author Soma Sekhar Updated - 05:51 PM, Fri - 21 July 23
లేటెస్ట్ ఫోటో షూట్ తో అదరకొడుతున్న పాయల్! ఫొటోలు వైరల్..

ఇండస్ట్రీలో టైమ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. పది సినిమాలు చేసినా రాని పేరు.. కొంత మందికి ఒక్క సినిమాతోనే వస్తుంది. అలా వచ్చిన ఫేమ్ ను కొంత మంది వాడుకుని సరైన కథలను ఎంచుకుని స్టార్ హీరోలుగా, హీరోయిన్ లుగా వెలుగొందుతుంటారు.  మరికొంత మంది ఆ ఫేమ్ ను సరిగ్గా వాడుకోరు. ఇక టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ కు రానీ క్రేజ్ పాయల్ రాజ్ పుత్ కు ఒక్క సినిమాతోనే వచ్చింది. ఆర్ఎక్స్ 100 మూవీతో ఈ ముద్దుగుమ్మకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. అయితే ఆ క్రేజ్ ను సరిగ్గా వాడుకోలేకపోయింది ఈ బ్యూటీ. తాజాగా కొంత మంది డైరెక్టర్లు నన్ను వాడుకున్నారంటూ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది పాయల్. సినిమాల సంగతి అటుంచితే.. సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటుంది ఈ అమ్మడు. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్లకు నిద్రను దూరం చేస్తుంది. తాజాగా మరో బెడ్ పై పిల్లోని కౌగిలించుకుంటూ మరో పిక్ ను వదిలింది ఈ బోల్డ్ బ్యూటీ.

పాయల్ రాజ్ పుత్.. డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ ఒక్క చిత్రంతోనే ఈ హాట్ బ్యూటీకి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తోనే వరుసగా సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే కథల ఎంపికలో సరైన అవగాహనలేక తన కెరీర్ ను తానే దెబ్బతీసుకుంది. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనను ఇండస్ట్రీలోని కొంత మంది డైరెక్టర్లు వాడుకున్నారని సంచలన కామెంట్స్ చేసింది.

ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోతకు యూత్ ఫిదా అయిపోయారు. అందుకు తగ్గట్టుగానే తన హాట్ అండ్ బోల్డ్ పిక్స్ ను, వీడియోలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటుంది. తాజాగా మరో ఫొటోను వదిలింది ఈ హాట్ బ్యూటీ. బెడ్ పై బ్లూ టీ షర్ట్ తో పిల్లోను కౌగిలించుకుంటూ.. హోయలు బోతోంది ఈ సొగసరి. తన థైస్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ఫొటో షూట్స్ తో, రీల్స్ తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తన తొలి డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మంగళవారం’ అనే సినిమాతో పాటుగా మాయాపేటిక సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు బెడ్ పై కవ్విస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి