“నేను తప్పు చేశా”.. ఎలన్ మస్క్ ‘యూటర్న్’..!

“నేను తప్పు చేశా”.. ఎలన్ మస్క్ ‘యూటర్న్’..!

  • Published - 02:05 PM, Mon - 7 November 22
“నేను తప్పు చేశా”.. ఎలన్ మస్క్ ‘యూటర్న్’..!

ఉద్యోగుల తొలగింపులో ట్విటర్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌ ‘యూటర్న్‌’ తీసుకున్నారు. 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు)కు ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్‌ ఆ సంస్థలోని సగానికి పైగా ఉద్యోగుల్ని తొలగించారు. ఇప్పుడు వారిని తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

ట్విటర్‌ ప్రక్షాళనలో భాగంగా మస్క్‌ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించారు. అయితే తాను ఊహించిన విధంగా కొత్త ఫీచర్లను తయారు చేయాలంటే ఫైర్‌ చేసిన ఉద్యోగుల పనితనం, అనుభవం అవసరం.

కానీ మేనేజ్మెంట్‌ వారిని గుర్తించకుండానే పింక్‌ స్లిప్‌ ఇచ్చి ఇంటికి సాగనంపింది. ఇప్పుడు జరిగిన తప్పిదాన్ని గుర్తించిన ట్విటర్‌ యాజమాన్యం ఆ ఉద్యోగుల్ని సంప‍్రదించి.. తిరిగి వారు విధుల్లో చేరేలా మంతనాలు జరుపుతోందంటూ’ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

Show comments