Venkateswarlu
Venkateswarlu
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. అంటువ్యాధులు విజృంభిస్తాయి. కలుషిత నీటి కారణంగానే ఎక్కువ జబ్బులు వస్తూ ఉంటాయి. అంతేకాదు! వర్షాల కారణంగా వాతావరణం మొత్తం చల్లగా మారుతుంది. దీంతో వ్యాధులు చాలా ఈజీగా మనుషులపై దాడి చేస్తాయి. దోమలు కూడా తమ పంజా విసురుతూ ఉంటాయి. ఇక, ఈ వర్షాకాలంలో ఎక్కువగా టైఫాయిడ్, మలేరియాతో పాటు ఇతర అంటు వ్యాధులు వస్తూ ఉంటాయి. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి. లేదంటే లేని పోని ప్రమాదాల్లో పడాల్సి వస్తుంది. వర్షాకాలంలో మీ ఆరోగ్యం బాగుండాలంటే ఈ టిప్స్ పాటించండి!