iDreamPost
android-app
ios-app

అవతార్ 2తో చేతులు కలిపిన పుష్ప 2

అవతార్ 2తో చేతులు కలిపిన పుష్ప 2

ఇంకా పూర్తి స్థాయి రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకుండానే పుష్ప 2 ప్రమోషన్లు నెక్స్ట్ లెవెల్ కు వెళ్తున్నాయి. వచ్చే నెల పదిహేడో తేదీతో పుష్ప 1 వచ్చి సరిగ్గా ఏడాది అవుతుంది. ఇంత సుదీర్ఘ సమయం కేవలం స్క్రిప్ట్ కోసమే వెచ్చించిన దర్శకుడు సుకుమార్ అంచనాలకు తగ్గట్టే చాలా పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో అదనపు పాత్రలతో సీక్వెల్ ని ఓ రేంజ్ లో ప్లాన్ చేశారని సమాచారం. ఆర్టిస్టులు ఎక్కువగా ఉండటంతో వాళ్ళ కాల్ షీట్లు సర్దుబాటు చేసుకోవడంలో కొంత ఆలస్యం జరుగుతోంది. బ్యాంకాక్ లో ప్లాన్ చేసిన షెడ్యూల్ కి సంబంధించి వీసా తదితర వ్యవహారాల్లో ఏవో చిక్కులు రావడంతో ఇంకో రెండు మూడు వారాల తర్వాత బయలుదేరే ఛాన్స్ ఉంది.

Actor Fahadh Faasil Hints On Allu Arjun pushpa 3 | లైన్‌లో పుష్ప 3 కూడా..? సుకుమార్ ప్లానింగ్ అదుర్స్– News18 Telugu

ఇదిలా ఉండగా పుష్ప 2 అవతార్ 2తో చేతులు కలపడం ఏమిటనుకుంటున్నారా. అవును నిజమే. ఒక స్పెషల్ టీజర్ ని ప్రత్యేకంగా షూట్ చేసిన సుక్కు దాన్ని డిసెంబర్ 16న రిలీజ్ కాబోయే అవతార్ 2 థియేటర్లలో ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పటికే చిత్రీకరణ అయిపోయిందని అందులో బన్నీ ఒకడే ఉంటాడా లేక ఇతర ఆర్టిస్టులు కనిపించే ఛాన్స్ ఉందానేది ఇంకొద్దిరోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. ఇప్పుడీ టీజర్ కోసం పెడుతున్న ఖర్చు, డిజిటల్ వ్యయం, స్క్రీన్ కౌంట్ ని బట్టి సర్వీస్ ప్రొవైడర్స్ కు కట్టాల్సిన మొత్తం ఇవన్నీ కలిపి పెద్ద మొత్తమే అవుతోంది. అయినా కూడా తగ్గేదేలే అంటూ ఇండియా వైడ్ స్క్రీనింగ్ కి ప్లాన్ చేశారట.

Pushpa 2: బన్నీ (Allu Arjun) అభిమానులకు శుభవార్త.. 'అవతార్ 2' (Avatar 2)తో కలసి సందడి చేస్తానంటున్న పుష్పరాజ్!

ఇందులోనే పుష్ప 2 రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. డిసెంబర్ కాకుండా 2024 జనవరికి ఫిక్స్ కావొచ్చని ఇన్ సైడ్ టాక్. బిజినెస్ పరంగా విపరీతమైన క్రేజ్ నెలకొన్న పుష్ప 2 కోసం నిర్మాతలు అత్యధికంగా రేట్లు కోట్ చేస్తున్నా బయ్యర్లు ముందుకొస్తున్నారని తెలిసింది. నార్త్ నుంచి భారీగా ప్రతిపాదనలు ఉన్నాయి. ఇంత విపరీతమైన ఒత్తిడి ఉంది కాబట్టే సుకుమార్ ఏడాదికి పైగా టైం తీసుకోవాల్సి వచ్చింది. రష్మిక మందన్నతో పాటు మరో హీరోయిన్ ఉంటుందన్న ప్రచారం ఇంకా కొనసాగుతోంది. సునీల్, అనసూయ, ఫహద్ ఫాసిల్, ధనుంజయ తదితరులు పుష్ప 2 ఎక్కువ స్పాన్ దక్కించుకోనున్నారు. సామ్ చేసిన ఐటెం సాంగ్ స్థానంలో ఇప్పుడెవరు వస్తారో.