ఆది పురుష్ కొత్త డేట్ – విదేశాల్లో ఇబ్బందే..

  • Published - 10:41 AM, Mon - 7 November 22
ఆది పురుష్ కొత్త డేట్ – విదేశాల్లో ఇబ్బందే..

వారం క్రితమే లీకైపోయిన ఆది పురుష్ విడుదల వాయిదా ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. 2023 జూన్ 16ని కొత్త డేట్ గా లాక్ చేస్తూ యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చింది. నిజానికి శ్రీరామనవమిని పురస్కరించుకుని మార్చి 30న రిలీజ్ చేస్తారనే న్యూస్ వచ్చింది కానీ ఆలోగా పోస్ట్ ప్రొడక్షన్ అయ్యే సూచనలు లేకపోవడంతో ఇంకెక్కువ టైం తీసుకుంటున్నారు. అసలు ఇన్ని పనులు పెట్టుకుని ఏ కాన్ఫిడెన్స్ తో జనవరిలో రావాలని నిర్ణయించుకున్నారని అభిమానులకు డౌట్ వస్తోంది. అయితే టీజర్ లో వచ్చిన కంప్లైంట్స్ ని సీరియస్ గా తీసుకున్న టి సిరీస్ బృందం ఇప్పుడు ఆ రిపేర్ల కోసమే వంద కోట్ల దాకా అదనంగా ఖర్చు పెట్టబోతోందని సమాచారం.

సరే లేట్ అయినా సరే వస్తోంది కదాని పూర్తిగా సంతోషించడానికి లేదు. ఎందుకంటే జూన్ 16 సీజన్ పరంగా బెటరే కానీ ఓవర్ సీస్ కోణంలో చూసుకుంటే చాలా రిస్క్ పొంచి ఉంది. ఆ నెల 2న స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్, 9న ట్రాన్స్ ఫార్మర్స్ రైజ్ అఫ్ ది బీస్ట్స్, 23న ది ఫ్లాష్ లు రాబోతున్నాయి. ఇవన్నీ త్రీడి వెర్షన్లతో వస్తున్నవే. సాధారణంగా హాలీవుడ్ మూవీస్ కి డిస్ట్రిబ్యూటర్లు మెయిన్ స్క్రీన్లకు రెండు నుంచి నాలుగు వారాల కనీస అగ్రిమెంట్ చేసుకుంటారు. అలా జరిగితే యుఎస్, యుకె తదితర దేశాల్లో భారీ ప్లానింగ్ లో ఉన్న ఆది పురుష్ కి థియేటర్లు దొరకవు. అలాంటప్పుడు లేనిపోని రిస్క్ అవుతుంది. ఇంత దూరం నిర్మాతలు ఆలోచించారో లేదో.

సరే ఇవన్నీ పక్కనబెడితే ఆది పురుష్ నిజంగా ఆ డేట్ కే వస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. పైగా ప్రభాస్ సినిమాలు మాటకు కట్టుబడటం అనేది బాహుబలి నుంచే సాధ్యపడటం లేదు. ఇంకా ఏడు నెలల టైం ఉంది కాబట్టి ఆలోగా పరిణామాలు ఎన్ని రకాలుగా మారతాయో చెప్పం. వీటికి తోడు సలార్ రిలీజ్ ని సెప్టెంబర్ కి ఇది వరకే చెప్పేశారు. మరి దానికే కట్టుబడతారా లేక ఆది పురుష్ వస్తుందా లేదా చూసుకుని అప్పుడు నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోవడం వల్ల వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తునివులకు మేలు చేసినట్టే. ఏంటో అన్నీ ప్రభాస్ కే జరుగుతాయని ఫ్యాన్స్ ఫీలింగ్.

Show comments