iDreamPost

విజయదశమి రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారో తెలుసా?

విజయదశమి రోజు ప్రతీ ఒక్కరు జమ్మి చెట్టును ఎంతో పవిత్రంగా కొలిచి పూజిస్తుంటారు. ఇంతకు జమ్మి చెట్టును అంతలా కొలిచి పూజించటానికి కారణం ఏంటి? ఆ ఆకుకు, చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే?

విజయదశమి రోజు ప్రతీ ఒక్కరు జమ్మి చెట్టును ఎంతో పవిత్రంగా కొలిచి పూజిస్తుంటారు. ఇంతకు జమ్మి చెట్టును అంతలా కొలిచి పూజించటానికి కారణం ఏంటి? ఆ ఆకుకు, చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే?

విజయదశమి రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారో తెలుసా?

దసరా పండగ వచ్చిందంటే చాలు.. పండగ జరుపుకునే ప్రతీ ఇంట్లో రక రకాల పండి వంటలు చేస్తారు. ఇంతే కాకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కొత్త బట్టలు ధరించి గ్రామస్తులతో అలయ్ బలాయ్ చేసుకుంటారు. ఇక దీంతో పాటు వాహనాలకు పూజలు కూడా చేయిస్తుంటారు. ఇందులో భాగంగానే విజయదశమి రోజు ప్రతీ ఒక్కరు జమ్మి చెట్టును ఎంతో పవిత్రంగా కొలిచి పూజిస్తుంటారు. ఇంతకు జమ్మి చెట్టును అంతలా కొలిచి పూజించటానికి కారణం ఏంటి? ఆ ఆకుకు, చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అసలు ఏంటి ఆ స్టోరీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం..

పాండవులు అందరూ అరణ్య వాసానికి పయనమైనప్పుడు తమ వద్ద ఉన్న ధనస్సు విల్లంబులు మొదలగు ఆయుధాలను వారు అడవికి వెళ్లే మార్గంలోని ఓ జమ్మి చెట్టుపై పెడతారు. ఇక మళ్లీ మేము తిరిగి వచ్చేంత వరకు వాటిని జాగ్రత్తగా కాపాడమని పాండవులు అంతా కలిసి ఆ జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు. ఇక వారి అరణ్య వాసం ముగించుకుని తిరిగి వస్తారు. ఆ తర్వాత విజయ దశమి రోజున ఆ జమ్మి చెట్టు వద్దకు పూజించి వాళ్లు దాచి ఉంచిన ఆ ధనస్సు విల్లంబులు, గద మొదలగు ఆయుధాలను తిరిగి తెచ్చుకుంటారు. ఆ తర్వాత కౌరవులపై జరిగిన యుద్దంలో పాండవులు విజయం సాధిస్తారు. దీని కారణంగానే అందరూ విజయ దశమి రోజు విజయం సాధించాలని ఆ జమ్మి చెట్టును పూజించి ఆ ఆకును జేబులో ఉంచుకుంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి