iDreamPost
android-app
ios-app

విశాఖ: డిగ్రీ పాసైతే చాలు.. బ్యాంకులో ఉద్యోగాలు.. రూ.46 వేల వరకు జీతం

  • Published Jan 05, 2024 | 2:11 PM Updated Updated Jan 05, 2024 | 2:11 PM

Visakhapatnam: డిగ్రీ పాసయ్యి.. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.. అందులోనూ మీరు ఏపీ వాసులా.. అయితే ఈ వార్త మీకోసమో. విశాఖలో భారీ జీతంతో బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆ వివరాలు..

Visakhapatnam: డిగ్రీ పాసయ్యి.. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.. అందులోనూ మీరు ఏపీ వాసులా.. అయితే ఈ వార్త మీకోసమో. విశాఖలో భారీ జీతంతో బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆ వివరాలు..

  • Published Jan 05, 2024 | 2:11 PMUpdated Jan 05, 2024 | 2:11 PM
విశాఖ: డిగ్రీ పాసైతే చాలు.. బ్యాంకులో ఉద్యోగాలు.. రూ.46 వేల వరకు జీతం

నేటి కాలంలో ఉద్యోగం రావడం.. అందునా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అన్నది చాలా కష్టంగా మారింది. అందులోనూ ఉన్న ఊరిలోనే జాబ్ దొరకడం అంటే అది మరింత కష్టం. ప్రైవేటు కంపెనీలు ఇచ్చే అరకొర జీతాల కోసం సొంత ఊరిని విడిచిపెట్టి వెళ్లలేక.. చాలామంది యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. డిగ్రీలు చేసి కూడా.. ఉపాధి లేక నిరాశగా జీవితాలను గడుపుతున్నారు. అలాంటి వారి కోసం ఓ శుభవార్త.. నెలకు 46 వేల రూపాయల వేతనంతో బ్యాంకు జాబులకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆ వివరాలు..

విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (వీసీబీఎల్).. తాజాగా జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీసీబీఎల్‌ శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా 30 ప్రొబేషనరీ ఆఫీసర్ (డిప్యూటీ మేనేజర్) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 28 చివరి లాస్ట్ డేట్. మరి ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి వంటి వివరాలు..

jobs in vizag co operative bank

పోస్టులకు సంబంధించి ముఖ్యమైన సమాచారం ఇదే..

  • ప్రొబేషనరీ ఆఫీసర్ (డిప్యూటీ మేనేజర్): 30 పోస్టులు
  • అర్హత: 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
  • ఏజ్ లిమిట్: 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న వారు అర్హులు.
  • వేతనం: నెలకు రూ.20,330 నుంచి రూ.45,590 గా ఉంటుంది.
  • సెలక్షన్ ప్రాసెస్: ప్రిలిమినరీ/ మెయిన్ పరీక్షలు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • అప్లికేషన్ ఫీజ్: రూ.1,000.
  • ఎగ్జామ్ సెంటర్స్: వైజాగ్‌, విజయవాడ, హైదరాబాద్‌, కర్నూలు, కాకినాడ, తిరుపతి కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జనవరి 28, 2024.
  • ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2024.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.vcbl.in/