P Venkatesh
HDFC Bank Parivartan's ECSS Programme 2024-25: విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ నిరుపేద విద్యార్థుల కోసం స్కాలర్ షిప్స్ అందిస్తోంది. ఏకంగా రూ. 75 వేల వరకు పొందొచ్చు. ఇప్పుడే అప్లై చేసుకోండి.
HDFC Bank Parivartan's ECSS Programme 2024-25: విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ నిరుపేద విద్యార్థుల కోసం స్కాలర్ షిప్స్ అందిస్తోంది. ఏకంగా రూ. 75 వేల వరకు పొందొచ్చు. ఇప్పుడే అప్లై చేసుకోండి.
P Venkatesh
నేటి రోజుల్లో చదువుకోవాలంటే.. చదువు కొనాలనే పరిస్థితి దాపరించింది. తమ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందించడం కోసం లక్షల రూపాయలను వెచ్చిస్తున్నారు తల్లిదండ్రులు. ఇక నిరుపేద విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మధ్యలోనే ఆపేసి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ప్రతిభ ఉండి కూడా డబ్బు లేని కారణంగా విద్యకు దూరమవుతున్నారు. ఇలాంటి విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్ డీఎఫ్ సీ. నిరుపేద విద్యార్థులకు ఏకంగా 75 వేల వరకు స్కాలర్ షిప్ అందించేందుకు ఓ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేసింది.
ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థుల విద్య కోసం హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్ షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్ పేరుతో ఆర్థిక చేయూతనందిస్తోంది. 1వ తరగతి నుంచి పీజీ వరకు విద్యనభ్యసించే పేద విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు. 1-12వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్, యూజీ, పీజీ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 4 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.