Sandip University Nashik- Foreign University Partnership: ఇండియాలోని ఈ యూనివర్సిటీలో చేరితే.. మీరు ఫారెన్ లో కూడా చదవచ్చు..

ఇండియాలోని ఈ యూనివర్సిటీలో చేరితే.. మీరు ఫారెన్ లో కూడా చదవచ్చు..

Sandip University Nashik- Foreign University Partnership: నాసిక్ లోని ఈ సందీప్ విశ్వవిద్యాలయంలో మీరు చేరితే.. విదేశాల్లో కూడా చదువుకునే అవకాశం లభిస్తుంది. అలాగే అందుకు స్కాలర్ షిప్ సౌకర్యం కూడా ఉంటుంది.

Sandip University Nashik- Foreign University Partnership: నాసిక్ లోని ఈ సందీప్ విశ్వవిద్యాలయంలో మీరు చేరితే.. విదేశాల్లో కూడా చదువుకునే అవకాశం లభిస్తుంది. అలాగే అందుకు స్కాలర్ షిప్ సౌకర్యం కూడా ఉంటుంది.

విద్యార్థులకు ఇప్పుడు నాణ్యమైన విద్యతో పాటుగా.. వరల్డ్ క్లాస్ ఎమినిటీస్ కూడా కావాలి. అంతేకాకుండా బాహ్య ప్రపంచం ఎలా ఉంటుందో తెలియాలి. బయట పోటీ ఎలా ఉంది? ఎలాంటి విద్యా విధానం ఉంది? అసలు విదేశాల్లో యూనివర్సిటీలు ఎలాంటి విధానంలో విద్యను బోధిస్తున్నారు? ఇలాంటి చాలా సమాచారం విద్యార్థులకు ప్రాక్టికల్ గా తెలియాల్సి ఉంటుంది. కానీ, చాలా మందికి ఆ అవకాశం దక్కడం లేదు. అందుకు చాలానే కారణాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు,అవకాశాలు లేకపోవడం, ఎలా వెళ్లాలో తెలియకపోవడం ఇలా కారణం ఏదైనా చాలా మంది విదేశీ విద్య అంటే అందని ద్రాక్ష అనే భ్రమలోనే ఉన్నారు. కానీ, మీరు గనుక ఈ యూనివర్సిటీలో చేరితే.. విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని కూడా అందుకోవచ్చు.

ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్యను పొందాలి అంటే చాలానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత విద్య అంటే తేలిక కాదు. వరల్డ్ క్లాస్ ఎమినిటీస్, బెటర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ టీజింగ్ స్టాఫ్ ఇలాంటి వసతులు ఉండాలి అంటే మీరు చాలానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ, మధ్యతరగతి విద్యార్థులు కూడా చదువుకునే విధంగా ఈ యూనివర్సిటీలో తక్కువ ఖర్చుతోనే ఉన్నత విద్యను బోధిస్తున్నారు. ఆ యూనివర్సిటీ ఎక్కడో కాదు.. మహారాష్ట్రలోని నాసిక్ లో ఉంది. ఆ యూనివర్సిటీ పేరు సందీప్ యూనివర్సిటీ. దీనిని సందీప్ ఎన్.ఝా స్థాపించారు. ఒక ఇంజినీరింగ్ కాలేజ్ ని స్టార్ట్ చేసిన ఆయన.. ఆ తర్వాత ఒక్కో కాలేజ్ ని స్టార్ట్ చేస్తూ.. చివరకు ఒక యూనివర్సిటీగా తీర్చి దిద్దారు.

ఈ సందీప్ యూనివర్సిటీలో విద్యార్థులకు ఉన్నత విద్యను ఉన్నత వసతులతో అందిస్తున్నారు. అంతేకాకుండా విద్య మాత్రమే కాకుండా.. ఎక్స్ ట్రా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. స్పోర్ట్స్, గేమ్స్, డాన్స్ ఇలా అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఈ యూనివర్సిటీ ఏకంగా 250 ఎకరాల్లో కొలుదీరి ఉంది. అత్యాధునిక క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, బెస్ట్ స్టాఫ్, 24 గంటల సెక్యూరిటీ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అయితే మార్కెట్ లో ఉన్న ఎన్నో ప్రైవేటు వర్సిటీల కంటే ఎంతో తక్కువ ఖర్చుతోనే విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్నారు. అలాగే ఇక్కడ విదేశీ విద్యా విధానం కూడా ఉంది.

స్టూడెంట్స్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రామ్:

ఈ సందీప్ యూనివర్సిటీలో ఉన్న ఎన్నో అద్భుతమైన సౌకర్యాల్లో ఈ విదేశీ విద్యా విధానం కూడా ఒకటి. అంటే ఇక్కడ విదేశీ యూనివర్సిటీలతో టై అప్ అయ్యి ఉంటారు. అంటే అక్కడి విద్యార్థులు సందీప్ యూనివర్సిటీలో.. ఇక్కడి విద్యార్థులు ఫారెన్ లోని విశ్వవిద్యాలయాల్లో కొన్ని నెలలు విద్యను అభ్యసించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఫారెన్ ఎక్స్ ఛేంజ్ కు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే.. స్కాలర్ షిప్ ఇచ్చి మరీ విదేశాలకు పంపుతామంటూ వెల్లడించారు. అంటే విద్యార్థులకు అన్ని విధాలుగా బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది సందీప్ ఝా ఉద్దేశం. అందుకు తాను ఎంత వరకు సాయం చేయాలో అంత వరకు చేస్తానంటూ వెల్లడిస్తున్నారు. ఇది ఒక సెల్ఫ్ ఫండింగ్ విశ్వ విద్యాలయం అయినా కూడా విద్యార్థులకు మాత్రం అద్భుతమైన స్కాలర్ షిప్ సౌకర్యం కల్పిస్తున్నారు. మెరిట్ కు సాధ్యమైనంత సాయం చేస్తున్నారు.

Show comments