iDreamPost

తండ్రి కార్మికుడిగా పనిచేసిన చోట కమిషనర్‌గా కూతురు..!

తండ్రి సఫాయి కార్మికుడు. రోడ్డు ఊడుస్తూ, కాల్వలోని చెత్త తీస్తూ.. ఆ వచ్చిన డబ్బులతో కూతుర్ని చదివించాడు. అయితే పై చదువులు చదివించేందుకు అతడి ఆర్థిక స్తోమత సరిపోలేదు. ఓ వ్యక్తికి ఇచ్చి కట్టబెట్టాడు. అక్కడకు వెళ్లాక..

తండ్రి సఫాయి కార్మికుడు. రోడ్డు ఊడుస్తూ, కాల్వలోని చెత్త తీస్తూ.. ఆ వచ్చిన డబ్బులతో కూతుర్ని చదివించాడు. అయితే పై చదువులు చదివించేందుకు అతడి ఆర్థిక స్తోమత సరిపోలేదు. ఓ వ్యక్తికి ఇచ్చి కట్టబెట్టాడు. అక్కడకు వెళ్లాక..

తండ్రి కార్మికుడిగా పనిచేసిన చోట కమిషనర్‌గా కూతురు..!

తమ జీవితం సరిగ్గా లేకపోయినా.. పిల్లలకు బంగారం లాంటి భవితవ్యాన్ని ఇవ్వాలనుకుంటారు ప్రతి తల్లీ, తండ్రి. అందుకే పిల్లలకు తమ కష్టం విలువ తెలియకుండా పెంచుతుంటారు. వారిని ఉన్నత చదువులు చదివించాలని, వారికి ఇష్టమైన ఎడ్యుకేషన్ అందించాలని అనుకుంటారు. బిడ్డలు ప్రయోజకులైతే చూడాలనుకుంటారు. అందుకోసం అహర్నిశలు శ్రమ పడుతూనే ఉంటారు. కానీ ఫలితం వచ్చే సమయానికి తమ గెలుపు కోసం పోరాడిన వ్యక్తులే లేకపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఇదిగో దుర్గ విషయంలో అదే జరిగింది. తండ్రి కష్టపడి చదివిస్తే.. భర్త ఆమెను ప్రభుత్వ కొలువు సాధించేలా సపోర్టు చేశాడు. చివరకు ఆమె ఏకంగా పెద్ద ఉద్యోగంలో చేరబోతుంది. తండ్రి ఉద్యోగం చేసిన ప్రాంతానికి పెద్దాఫీసర్ అయ్యింది.

తండ్రి సఫాయి కార్మికుడిగా పనిచేసిన చోట.. దుర్గ మున్సిపల్ కమీషనర్‌గా బాధ్యతలు చేపట్టబోతుంది. కానీ ఆ ఆనందాన్ని పంచుకోవడానికి తండ్రి లేకపోవడం ఆమెను బాధపెట్టింది. దుర్గ విజయగాధ ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తమిళనాడులోని మన్నార్గుడిలో నివసించే శేఖర్ అనే సఫాయి కార్మికుడికి భార్య సెల్వి, ఒకగానొక్క కూతురు దుర్గ ఉంది. కూతురి కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. దుర్గ చదువులో బాగా రాణించేది. స్కాలర్ షిప్‌తో తమిళ మాధ్యమంలో ఫిజిక్స్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుకుంది. పై చదువులు చదివించేందుకు ఆమె తండ్రి వద్ద సరైన డబ్బులు లేకపోవడంతో.. ఆమెకు 2015లో చెంగల్‌పేటలోని మధురాంతకం నివాసి, ప్రభుత్వ శాఖలో తాత్కాలిక ఉద్యోగి కె నిర్మల్‌కుమార్‌తో వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు.

Daughter got job where her father working

అయితే దుర్గకు చదువుకోవాలన్న ఆశ ఉందని తెలిసిన.. భర్త ఆమెను చదవించి.. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు మద్దతు ఇచ్చాడు. అలా 2016 నుండి గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది. అలాగే టీఎన్పీఎస్సీ పరీక్షలు రాసేది. కొన్ని పరీక్షలు క్లియర్ చేసినా.. ఇంకొన్ని మిస్ అయ్యి.. కొలువు సాధించలేకపోయింది. అయినప్పటికీ.. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంది. TNPSC గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలకు, 2023లో మెయిన్స్‌కు హాజరై విజయం సాధించింది. గ్రేడ్ -2లో మున్సిపాలిటీ కమిషనర్ ఆఫర్‌ను అందుకుంది. ఏ మున్సిపాలిటీలో తన తండ్రి సఫాయి కార్మికుడిగా వర్క్ చేశాడో.. అదే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు అందుకోబోతుంది దుర్గ. అయితే ఆమెను ఓ బాధ తొలిచేస్తుంది. ప్రభుత్వ కొలువు సాధించేలా నాన్న చాలా ప్రేరేపించారని, తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఆయన లేరని, ఆరు నెలల క్రితం చనిపోయినట్లు తెలిపింది దుర్గ. అలాగే తాను చదువుకుంటానంటే.. అత్తామామలు ఎంతో సహకరించారని, తన బిడ్డలను చూసుకునే వారని, తన భర్తను చాలా మంది ఎగతాళి చేసేవారని, అయినా సరే అతడు తనను ప్రోత్సహిస్తూనే ఉన్నాడని తెలిపింది దుర్గ. భార్య విజయం పట్ల భర్త ఎంతో ఆనందంతో పొంగిపోతున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి