P Krishna
KGBV in Admissions: ఆంధ్రప్రదేశ్ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.
KGBV in Admissions: ఆంధ్రప్రదేశ్ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.
P Krishna
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడపబడుతున్న 352 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో 6, 11వ తరగతుల ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ మొదలయ్యాయి. 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి మార్చి 12 నుంచి ఏప్రిల్ 11 వరకు ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం మార్చి 12 నుంచి ఏప్రిల్ 11 వ తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనాథలు, బడి బయట పిలల్లు, బడి మానేసిన పిల్లలు, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దారిద్ర్య రేఖ దిగువన ఉన్న బాలికలు ప్రవేశాలకు అర్హులు అని తెలిపారు. వివరాల్లోకి వెళితే..
ఏపీలోని 352 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో మార్చి 12 నుంచి ఏప్రిల్ 11 వరకు ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. 6,7,8,9 తరగతుల విద్యార్థుల సెలక్షన్ జాబితాలో ఏప్రిల్ 15 నాటికి రెడీ అవుతుందని సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏప్రిల్ 19 న జాబితా రిలీజ్ చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ సమాచారం అందజేస్తామని సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ అన్నారు. ఏప్రిల్ 19 నుంచి 24 వరకు సంబంధిత కేజీబీవీల్లో ప్రిన్సిపాల్స్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తారని అన్నారు. కేజీబీవీ అధికారిక వెబ్ సైట్ www.apkgbv.apcfss. in ద్వారా ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు.
దరఖాస్తు చేసుకునే వారికి ఆదాయ పరిమితి గ్రాహీన ప్రాంతాల్లో రూ.1.2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.4 లక్షలకు మించరాదు. మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఆర్‌టీఇ టోల్ ఫ్రీ నెంబర్ 18004258599 సంప్రదించాలని సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని సూచించారు. కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో చక్కటి విద్యాబోధన ఉంటుందని.. విద్యార్థినులకు మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు.