Arjun Suravaram
Tirumala News: తిరుమల శ్రీవారికి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. అంతేకాక మరికొన్ని ప్రత్యేక రోజుల్లో ఇతర సేవలు, పూజలు నిర్వహిస్తుంటారు. అలానే త్వరలో తిరుమలలో శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
Tirumala News: తిరుమల శ్రీవారికి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. అంతేకాక మరికొన్ని ప్రత్యేక రోజుల్లో ఇతర సేవలు, పూజలు నిర్వహిస్తుంటారు. అలానే త్వరలో తిరుమలలో శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
Arjun Suravaram
కలియుగ దైవమైన తిరుమల తిరుపతి శ్రీనివాసుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోని నలుమూల శ్రీవారి భక్తులు ఉన్నారు. నిత్యం వేలాది మంది శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తుంటారు. ఇక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అనేక చర్యలు తీసుకుంటుంది. అలానే తిరుమల తిరుపతి నుంచి వచ్చే సమాచారం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ముఖ్యంగా శ్రీవారి దర్శన సమయం, టికెట్ల విడుదల, ఇతర సేవలకు సంబంధించిన సమాచారం గురించి తెలుసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ నిర్ణయం ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
తిరుమల శ్రీవారికి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. అంతేకాక మరికొన్ని ప్రత్యేక రోజుల్లో ఇతర సేవలు, పూజలు నిర్వహిస్తుంటారు. అలానే త్వరలో తిరుమలలో శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. అక్టోబరు 3 నుంచి అక్టోబరు 12వ తేదీ వరకు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 3న అంకురార్పణం కార్యక్రమం జరుగుతోంది. ఆ రోజు నుండి 12వ తేదీన జరిగే శ్రీవారి చక్రస్నానం వరకు రోజూ వయో వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు టిటిడి రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టిటిడి పరిమితం చేసింది. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించి టిటిడికి సహకరించాలని కోరింది.
మరోవైపు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంత సిద్ధమవుతోంది. అత్యంత వైభంగా ఈ వేడుకను నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు శ్రీవారి భక్తులు సాధారణం కంటే అధికంగా తరలి వస్తారు. కావున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రీవారి దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. మరి..మొత్తంగా టీటీడీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.