Arjun Suravaram
TTD Anivara Asthanam: తిరుమల శ్రీవారికి ఎన్నో పూజలు జరుగుతుంటాయి. అంతేకాకా వివిధ సందర్భాల్లో ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తుంటారు. అలానే రేపు కూడా శ్రీవారి ఆలయంలో కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్లే భక్తులకు కీలక అలెర్ట్
TTD Anivara Asthanam: తిరుమల శ్రీవారికి ఎన్నో పూజలు జరుగుతుంటాయి. అంతేకాకా వివిధ సందర్భాల్లో ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తుంటారు. అలానే రేపు కూడా శ్రీవారి ఆలయంలో కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్లే భక్తులకు కీలక అలెర్ట్
Arjun Suravaram
హిందువులకు ఎంతో ప్రత్యేమైన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి ఒక్కటి. ఇక్కడి శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక స్వామి వారిని దర్శించుకునే భక్తుల కోసం టీటీడీ అనేక చర్యలు తీసుకుంటుంది. వారికి దర్శనం, ఇతర సదుపాయాలను కలిగించేందుకు తరచూ పలు నిర్ణయాలు తీసుకుంటుంది. అలానే దర్శన విషయంలో ఏదైనా మార్పులు చేస్తే భక్తులను ముందే అలెర్ట్ చేస్తుంది. అందుకే శ్రీవారికి సంబంధించిన న్యూస్ కోసం భక్తులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. తాజాగా తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ ఓ కీలక సూచనలు చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తిరుమల శ్రీవారికి ఎన్నో పూజలు జరుగుతుంటాయి. అంతేకాకా వివిధ సందర్భాల్లో ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తుంటారు. అలానే రేపు కూడా శ్రీవారి ఆలయంలో కార్యక్రమం ఉంది. మంగళవారం శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో రేపు ఆర్జిత సేవలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అదే విధంగా రేపు సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్పపల్లకి పై స్వామివారు మాడ వీధుల్లో విహరిస్తారు. అలా ప్రత్యేక పల్లకి శ్రీనివాసుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కాగా, ఏటా దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఆణివార కార్యక్రమం జరగుతుంది.
ఇది తమిళుల సంప్రదాయం ప్రకారం ఆణిమాసం చివరి రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. అందుకే ఈ వేడుకలకు ఆణివార ఆస్థానం అనే పేరుతో నిర్వహిస్తుంటారు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలను ఆణివార ఆస్థానం పర్వదినం రోజున స్వీకరించారు. అదే రోజు నుంచి టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రారంభమైయ్యేది. టీటీడీ ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ ఏప్రిల్ కు మారింది. ఆనాదికాలంగా వస్తున్న ఆచారాన్ని అనుసరిస్తూ ఇప్పటికీ తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఈ ఇక ఈ వేడుకు సందర్భంగా శ్రీరంగం దేవస్ధానం తరుపున స్వామివారికి ప్రత్యేకంగా పట్టువస్త్రాలను అధికారులు సమర్పించనున్నారు. ఈ వస్త్రాలను ముందుగా పెద్ద జీయర్ మఠంలో వుంచి ప్రత్యేక పూజలు నిర్వహింస్తారు.
అనంతరం మంగళవాయిద్యాల నడుమ జీయర్ స్వాములు, ఆలయ అధికారులు ఊరేగింపుగా తీసుకువచ్చి ఆ వస్తారను స్వామి వారికి సమర్పించనున్నారు. ఆ తరువాత శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో సర్వభూపాల వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక ఆణివార ఆస్థానం నిర్వహించే రోజున స్వామి వారు సాయంకాలం సమయాన పుష్పపల్లకిపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులుకు దర్శనం ఇస్తారు. ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా రేపు ఆర్జిత సేవలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.