Arjun Suravaram
TTD: తిరుమల తిరుపతికి సంబంధించిన సమచారాం కోసం శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే వారికి శ్రీవారి లడ్డూ విషయంలో ఓ గుడ్ న్యూస్ అందింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
TTD: తిరుమల తిరుపతికి సంబంధించిన సమచారాం కోసం శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే వారికి శ్రీవారి లడ్డూ విషయంలో ఓ గుడ్ న్యూస్ అందింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Arjun Suravaram
తిరుమల తిరుపతిలో వెలసిన శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు నిత్యం ఎంతో మంది భక్తులు వస్తుంటారు. అంతేకాక స్వామి దర్శనం, ఇతర తిరుమలకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే శ్రీవారి భక్తులకు టీటీడీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఓ సమాచారం ఇచ్చింది. శ్రీవారి లడ్డూను ఇకపై ఎంపిక చేసిన కేంద్రాల్లోనూ అందుబాటులో ఉంచాలని టీటీడీ నిర్ణయించింది.
తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై శ్రీవారి దర్శనం టికెట్ లేకుండానే తిరుమల ఆలయానికి వచ్చే వారికి గరిష్ఠంగా రెండు లడ్డూలు ప్రసాదంగా అందించనున్నారు. ఇదే సమయంలో లడ్డు విషయంలోభక్తుల నుంచి వస్తున్న వినతులతో టీటీడీ పరిగణలోకి తీసుకుంది. వారి విజ్ఞప్తుల మేరకు లడ్డూ పలు కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకొస్తోంది. భక్తుల విజ్ఞప్తి మేరకు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నట్లు చెప్పారు. స్థానిక ఆలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివ ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని సమాచార కేంద్రాల్లో శ్రీవారి లడ్డూను అందించనున్నారు.
శ్రీవారి ఆలయంలో లడ్డును అందించే విషయంలో ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. కార్డు చూపించి మాత్రమే రెండు లడ్డూలు కొనుగేలా చేసేలా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని అధికారులు తెలిపారు. నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారని టీటీడీ ఈవో తెలిపారు. టీటీడీలో నూతనంగా అత్యాధునిక ల్యాబరెటరీ ఏర్పాటు చేస్తునట్లు ఈవో వెల్లడించారు. ఇదే సమయంలో తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, దేవుని కడప, హైదరాబాద్ లోని హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్, అమరావతి, విజయవాడ, రాజమండ్రి, పిఠాపురం, విశాఖపట్నం, రంపచోడవరం, చెన్నైలోని శ్రీవారి ఆలయాలలో, అదే విధంగా బెంగుళూరు, వేలూరులలోని సమాచార కేంద్రాలలో శ్రీవారి లడ్డును విక్రయించినట్లు ఈవో తెలిపారు. మొత్తంగా శ్రీవారి లడ్డు విషయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.