P Krishna
Ayyappa Swamy Temple: శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ప్రతి ఏడాది ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు తరలి వెళ్తుంటారు. గత ఏడాది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భక్తులు పోటెత్తారని ట్రావెన్‌కోర్ దేవస్థానం తెలిపింది.
Ayyappa Swamy Temple: శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ప్రతి ఏడాది ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు తరలి వెళ్తుంటారు. గత ఏడాది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భక్తులు పోటెత్తారని ట్రావెన్‌కోర్ దేవస్థానం తెలిపింది.
P Krishna
గత ఏడాది శబరిమల అయ్యప్ప దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప భక్తుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులకు సరైన వసతులే లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారి విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కేరళా సర్కార్ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ సారి అలాంటి తప్పిదాలు జరగకుండా సీఎం విజయన్ ముందుగానే మేల్కొన్నట్లు తెలుస్తుంది. వచ్చే నెలలోనే మండల- మకర విళక్కు పూజల సీజన్ కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెచురుకోనున్న నేపథ్యంలో కేరళా ప్రభుత్వం భక్తులకు శుభవార్త చెప్పింది. దర్శనాల విషయంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళా ప్రభుత్వం గొప్ప శుభవార్త చెప్పింది. వచ్చే నెల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోనున్న సందర్భంగా దర్శనాల విషయంలో కీలక మార్పులు చేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు. ఆలయ ప్రధాన పూజారులను సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. శబరిమలలో అయ్యప్ప సన్నిధానంలో దర్శన వేళలు వేకువజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయని చెప్పారు. ఈ మార్పుల వల్ల అయ్యప్ప దర్శనాలకు రోజూ 17 గంటల పాటు సమయం ఉంటుందని ఆయన అన్నారు. అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవం నవంబర్ 15 నుంచి ప్రారంభమై.. డిసెంబర్ 26 వరకు కొనసాగుతుందని ప్రశాంత్ పేర్కొన్నారు. రెండు రోజుల పాటు ఆలయాన్ని మూసి వేసిన తర్వాత మల్లీ డిసెంబర్ 30 నుంచి మకరు విళక్కు పూజల కోసం గుడి తెరుస్తామని అన్నారు. జనవరి 14 న మకర సంక్రాంతి రోజు మకర జ్యోతి దర్శనం, 20న పడి పూజతో మకరు విళక్కు సీజన్ పూర్తవుతుందని ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే అయ్యప్ప దర్శనం చేసుకోవాలంటే కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే నమోదు చేసుకోవాలన్న నిర్ణయాన్ని కేరళా ప్రభుత్వం వెనక్కి తిసుకుంది. ఇటీవల ఆన్ లైన్ నమోదు చేసుకుంటేనే దర్శనం అనే నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో భక్తుల సౌలభ్యం కోసం తమ నిర్ణయంలో స్వల్ప మార్పులుచేసినట్లు చెబుతుంది కేరళా సర్కార్. ఆన్‌లైన్ టికెట్ బుక్ చేసుకోకపోయినా భక్తులకు తప్పకుండా అయ్యప్ప దర్శనం కల్పిస్తామని కేరళా సీఎం పినరయి తెలిపారు. భక్తులు ఏదైనా ప్రమాదాలకు గురైనా.. తప్పిపోయినా వారిని గుర్తించేందుకు ఆన్ లైన్ టికెట్ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో గతంలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే గత ఏడాదిలా స్పాట్ బుకింగ్ విధానాన్ని కొనసాగిస్తారా? లేక టికెట్లు లేకుండా దర్శనానికి వీలు కల్పిస్తారా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రతిరోజూ గరిష్టంగా దాదాపు 80 వేల మంది భక్తులను అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతించాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించింది.