Arjun Suravaram
K J Yesudas: తన గానంతో కోట్లాది మంది మనసుల్ని దోచేయటంతో పాటు.. తన తీరుతో అందరి మన్ననలు పొందిన ప్రముఖ గాయకుడు ఏసుదాసు. శుక్రవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా శబరిమల ఆలయంలో అరుదైన గౌరవం లభించింది.
K J Yesudas: తన గానంతో కోట్లాది మంది మనసుల్ని దోచేయటంతో పాటు.. తన తీరుతో అందరి మన్ననలు పొందిన ప్రముఖ గాయకుడు ఏసుదాసు. శుక్రవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా శబరిమల ఆలయంలో అరుదైన గౌరవం లభించింది.
Arjun Suravaram
ఎంతో మంది ప్రముఖులు తమదైన ప్రతిభతో పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంటారు. అంతేకాక తమ రంగంలో విశేష ప్రతిభ చూపించి..చరిత్రలో తమకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాక అలాంటి ప్రతిభావంతులకు అనేక అత్యున్నత పురష్కారాలు, అరుదైన గౌరవాలు లభిస్తుంటాయి. తాజాగా ప్రముఖ గాయకుడు, హరివరాసనం అవార్డు గ్రహీత కే.జె. ఏసుదాసుకు అరుదైన గౌరవం లభించింది. ఆయనకు శబరిమల పుణ్యక్షేత్ర బోర్డు సమున్నత స్థానాన్ని కల్పింపించింది. మరి.. ఏసుదాసుకు లభించిన అరుదైన గౌరవం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
ఏసుదాసు.. సంగీత ప్రియులకు, సినీ ప్రియులకు ఈ పేరు పెద్ద పరిచయం అక్కర్లేదు. తన గానంతో కోట్లాది మంది మనసుల్ని దోచేయటంతో పాటు.. తన తీరుతో అందరి మన్ననలు పొందారు. ఇక ఏసుదాసు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది.. శబరిమల అయ్యప్ప స్వామిపై ఆయన పాడిన పాటలు. అన్నింటికి మించి.. అయ్యప్ప స్వామిని స్మరిస్తూ.. హరిహరాసనం అని ఆయన ఆలపించిన గీతాన్ని ఎంతో ఫేమస్ అయ్యింది. చివరకు స్వామి వారి మూల విరాట్ వేంచేసే ఉండే శబరిమల ఆలయంలోనూ వినియోగించడం తెలిసిందే. పుట్టుక ఏ మతమన్నది ఎవరి చేతిలో ఉండదు. ఆ మాటకు వస్తే కళకు.. కళాకారుడికి మతం అన్నది అడ్డుకట్ట కానే కాదు. అదే నిరూపించారు ఏసుదాసు.
ఏసుదాసు పాడిన భక్తి పాటలు విన్నప్పుడు రోమాలు నిక్క బొడుచుకోవటమే కాదు.. తీవ్రమైన భావోద్వేగాన్ని కలిగిస్తాయన్నది తెలిసిందే. అలాంటి గొప్పవ్యక్తి అయినా ఏసుదాసుకు తాజాగా శబరి మల అయ్యప్ప ఆలయంలో అరుదైన గౌరవం లభించింది. ఆయన పుట్టిన రోజైన జనవరి 12న శుక్రవారం శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజల్ని నిర్వహించింది. ట్రావెన్ కోర్ దేవస్థానం ఏసుదాసు జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించింది. అయితే ఏసుదాసు ప్రస్తుతం భారత్ లో లేరు.. ఆయన ఇప్పుడు యూఎస్ఏలో ఉన్నారు. అయితే ఏసుదాసు పుట్టిన రోజు సందర్భంగా ఆయన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్తర ఆషాఢం పూజల కోసం శుక్రవారం శబరిమల ఆలయాన్ని అర్చకులు తెరచారు. అనంతరం గణపతి హోమం చేశారు. ఇదే శుక్రవారం కే.జె. ఏసుదాసు జన్మదినం కావడంతో ఆయన పేరిట అయ్యప్పస్వామికి నెయ్యాభిషేకం, సహస్రనామార్చన, ఇతర పూజలు చేసినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆయనకు ప్రసాదాలు పంపించనున్నట్లు పేర్కొంది. మరి.. శబరిమల ఆలయంలో ఏసుదాసుకు అందిన అరుదైన గౌరవంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.