Somesekhar
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని మీరు భావిస్తున్నారా? అయితే మీకు బిగ్ అలెర్ట్. తిరుమలలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని మీరు భావిస్తున్నారా? అయితే మీకు బిగ్ అలెర్ట్. తిరుమలలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Somesekhar
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడుతుంటారు. స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. అందుకే కాలంతో సంబంధం లేకుండా ప్రతిరోజు లక్షల్లో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అయితే ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని మీరు భావిస్తున్నారా? అయితే మీకు బిగ్ అలెర్ట్. తిరుమలలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
గత రెండు వారాలుగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో.. భక్తులు పోటెత్తారు. దాంతో ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి, బయట క్యూ లైన్లో వేచిచూస్తున్నారు. ఇకపోతే నారాయణగిరి షెడ్లు, సర్వదర్శనం క్యూ లైన్లు అన్నీకూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దాంతో స్వామివారి దర్శనానికి దాదాపు 18 నుంచి 20 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వీకెండ్ కావడం.. జూన్ 4న ఎన్నికల ఫలితాలు ఉండటంతో.. ఈ రద్దీ ఇంక పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు. దాంతో శ్రీవారి దర్శనానికి వచ్చేవారు రద్దీ తగ్గిన తర్వాత రావాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.
ఇక నేటి నుంచి జూన్ 5 వరకు తిరుమలలో హనుమన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లను చేసింది. అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జపాలి తీర్థంలో ఈ ఉత్సవాలను జరుపనున్నారు. ఈ ఐదు రోజులు రోజుకో రకంగా ఆంజయేయ స్వామివారిని పూజించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులు కోరారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండటం దృష్ట్యా.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తగిన ఏర్పాట్లు చేసుకుని రావాలని అధికారులు తెలిపారు.