Maha Shivaratri 2024: శివరాత్రి నాడు చేయాల్సిన 3 పనులు.. అశ్వమేధ యాగం చేసినంత ఫలితం!

Things to Do on Maha Shivaratri 2024: మహా శివరాత్రి నాడు చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. వీటిని ఆచరిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ పనులు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Things to Do on Maha Shivaratri 2024: మహా శివరాత్రి నాడు చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. వీటిని ఆచరిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ పనులు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మహా శివరాత్రి పర్వదినాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు. శంకరుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే మహా శివరాత్రి. దీంతో మహాదేవుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఉపవాసాలు ఉంటూ శివయ్య కటాక్షించాలని కోరుకుంటున్నారు. అయితే ఇవాళ చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఇవి చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. ఏంటా పనులు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

శివం అంటే శుభం అని అర్థం. రాత్రి అనే పదం రా అనే ధాతువు నుంచి వచ్చింది. రా అంటే దానార్థకమైనది. శుభాన్ని, సుఖాన్ని ప్రదానం చేసేదే శివరాత్రి. అలాంటి ఈ మహాశివరాత్రి పర్వదినాన ఉపవాస వత్రం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శివపురాణం చెబుతోంది. ఇవాళ ఉపవాస జాగరణలు చేసేవారు అష్టైశ్వర్యాలను పొంది, జన్మాంతంలో జీవన్ముక్తులు అవుతారని స్కాంధ పురాణం అంటోంది. ఏ పూజ చేసినా చేయకున్నా కేవలం తన కోసం ఉపవాసం చేసేవారు ఆ ఫలితాలన్నీ పొందుతారని స్వయంగా శివుడే పార్వతితో చెప్పాడు. ఈ నేపథ్యంలో మహా శివరాత్రి నాడు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పనులు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఉపవాస విశిష్టత
పరమాత్ముని సమీపంలో జీవుడు వశించడమే ఉపవాసం. ఎలాంటి ఇతరత్రా ఆలోచనలు చేయకుండా కేవలం భగవంతుని ఆరాధన చేయడమే ఉపవాసమని వరాహోపనిషత్తు చెబుతోంది. కాబట్టి మహా శివరాత్రి నాడు మహాదేవుడి కటాక్షం లభించాలంటే ఉపవాసం చేయాల్సిందే. అయితే ఉపవాస నియమాలు ఏంటో తెలుసుకొని దాన్ని ప్రారంభిస్తే మంచిది. ఏయే ఆహారం తీసుకోవాలి లాంటి వాటి గురించి తెలుసుకోవాలి.

రుద్రాభిషేకం
మనసులో ఉండే మలినాల్ని తొలగించుకోవడమే రుద్రాభిషేకంలో ఉన్న పరమార్థం. అందుకే మహాశివరాత్రి నాడు రుద్రాభాషేకం చేయడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. రుద్రాభిషేకం చేయడం, శివ మంత్రాలను పఠించడం ద్వారా సర్వ రోగాలు నయమవుతాయని, శుభ ఫలితాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం.

పంచాక్షరి మంత్రం
శివస్తోత్రాల్లో పంచాక్షరి మంత్రం అత్యుత్తమమైనది. పంచాక్షరాలైన నమః శివాయ (ఓం నమః శివాయ)ను శివరాత్రి నాడు భక్తిశ్రద్ధలతో పఠించాలి. అలా చేస్తే శివసాయజ్యం ప్రాప్తిస్తుందనేది విశ్వాసం. పంచాక్షరి మంత్రంతో పాటు మహామృత్యుంజయ మంత్రం, శివసహస్రనామస్తోత్రం పఠిస్తే శివానుగ్రహం కలుగుతుందనేది నమ్మకం. ఈ పర్వదినాన ఉపవాసం, జాగరణ, శివదర్శనం, లింగాభిషేకం, బిల్వార్చన, మహాదేవనామ సంకీర్తనల వల్ల అజ్ఞానం తొలగిపోతుంది.

ఇదీ చదవండి: శివరాత్రి నాడు పూజ సమయంలో ఏ రంగు దుస్తులు ధరించాలి?

Show comments