iDreamPost

Maha Shivaratri 2024: శివరాత్రి నాడు పూజ సమయంలో ఏ రంగు దుస్తులు ధరించాలి?

  • Published Mar 08, 2024 | 11:06 AMUpdated Mar 08, 2024 | 12:04 PM

శివరాత్రి పర్వదినం కావడంతో భక్తులు అందరూ శివాలయాలకు పోటెత్తుతున్నారు. మహాదేవడ్ని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాసాలు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శివరాత్రి నాడు పూజ సమయంలో ఏ రంగు దుస్తులు ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

శివరాత్రి పర్వదినం కావడంతో భక్తులు అందరూ శివాలయాలకు పోటెత్తుతున్నారు. మహాదేవడ్ని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాసాలు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శివరాత్రి నాడు పూజ సమయంలో ఏ రంగు దుస్తులు ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 08, 2024 | 11:06 AMUpdated Mar 08, 2024 | 12:04 PM
Maha Shivaratri 2024: శివరాత్రి నాడు పూజ సమయంలో ఏ రంగు దుస్తులు ధరించాలి?

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ ఉట్టిపడుతోంది. ప్రముఖ శైవాలయాల దగ్గర శివయ్యను దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారు జాము నుంచే పోటెత్తారు. దీంతో ఆలయాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. అనేక మంది భక్తులు ఉపవాసాలు మొదలుపెట్టారు. సాయంత్రం పూజలు నిర్వహించి ఉపవాస దీక్షను ముగిస్తారు. శివరాత్రి నాడు మహాదేవుడికి జలాభిషేకం, రుద్రాభిషేకం లాంటి పవిత్రమైన ఆచారాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఇవాళ స్వామివారికి పూజ సమయంలో ఎలాంటి దుస్తులు ధరించాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

శివపూజలో ధరించాల్సిన దుస్తులు

  • పరమశివుడికి ఆకుపచ్చని రంగు అంటే ఇష్టమని నమ్ముతారు. కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి నిర్వహించే పూజా కార్యక్రమాల్లో ఆకుపచ్చని రంగు దుస్తులు ధరించొచ్చు. అలాగే ఎరుపు, పసుపు, గులాబీ, నారింజ, తెలుపు రంగు బట్టల్ని కూడా వేసుకోవచ్చు.
  • శివరాత్రి నాడు నీలం రంగు దుస్తులకు దూరంగా ఉంటే బెటర్. ఇది ప్రతికూల శక్తిని తీసుకొస్తుందని విశ్వసిస్తారు. శివారాధన సమయంలో నలుపు, నీలం రంగు దుస్తులను ధరించొద్దని పండితులు చెబుతున్నారు.
  • మహా శివరాత్రి నాడు పూజ చేసే సమయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పర్వదినాన పూజ టైమ్​లో, సాయంత్రం వేళ నిద్రకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. శివభక్తిని చాటుకునేందుకు, ఆయన కటాక్షం పొందేందుకు ఇవాళ ఆరాధణ, జాగరణ చేయాలి. శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ శివయ్యను ఆరాధించాలి.
  • శివరాత్రి నాడు నిశిత కాలంలో మహాదేవుడ్ని పూజించడం శ్రేయస్కరం. శివుడ్ని నాలుగు ప్రహార్లలో పూజిస్తారనేది నమ్మకం. తొలి గంట ఉదయం 6.25 నుంచి రాత్రి 9.28 వరకు, రెండోది రాత్రి 9.28 నుంచి 12.31 వరకు, మూడోది అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఉంటాయి. అయితే నాలుగో గంట బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 3 నుంచి 6 గంటట మధ్యలో వస్తుంది.

ఇదీ చదవండి: శివరాత్రికి తొలిసారి ఉపవాసం ఉంటున్నారా? అయితే ఈ నియమాలు తెలుసుకోండి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి