iDreamPost
android-app
ios-app

వినాయకుడికి నైవేద్యంగా పెట్టిన కుడుములు మీరే తింటున్నారా? తప్పు!

వినాయకుడికి నైవేద్యంగా పెట్టిన కుడుములు మీరే తింటున్నారా? తప్పు!

హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో వినాయక చవితి ఒకటి. ప్రతి ఏటా భాద్రపద మాసం శుక్ల పక్షంలో వచ్చే చతుర్ధి రోజున వినాయక చవితి పండగను జరుపుకుంటాము. ఇక ఈ పండగ రోజును వీధి వీధిలో గణేషుడి మండపాలు  అంగరంగ వైభవంగా ముస్తాభవుతాయి. విద్యుత్ కాంతుల నడుమ గణపతి దేవుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ఇక వినాయకుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి.. ఆ తర్వాత.. ఎంతో ఘనంగా గణపయ్యను గంగమ్మ ఒడికి చేరుస్తాం. అలానే స్వామి వారికి వివిధ రకలా నైవేధ్యాలను సమర్పిస్తారు. అయితే వినాయక చవితి పండగ సమయంలో నైవేధ్యం విషయంలో మనకు తెలిసి, తెలియక కొన్ని పొరపాట్లు చేస్తాము.

గణపతి మోదక ప్రియుడు. ఆయనకు ఎన్ని ప్రసాదాలు పెట్టినా కూడ కుడుములు, ఉండ్రాళ్లే ప్రత్యేకం. అందుకే వాటినే స్వామి వారికి నివేదిస్తుంటారు. అందుకు బలమైన కారణం కూడా ఉంది. పురాణల ప్రకారం.. ఒకసారి శివపార్వతులతో కలిసి బాల గణేషుడు అరణ్యంలో సంచరిస్తుంటారు. మార్గం మధ్యలో గణేశుడికి ఆకలి వేయడంతో సమీపంలో ఉన్న అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్తారు. అత్రి మహర్షి, అనసూయాదేవి దంపతులు శివపార్వతులకు ఘనమైన అతిథ్యం ఇస్తారు.

ఆకలిగా ఉన్న బాల గణపతికి పంచభక్ష్య పరమాన్నాలు చేసి వడ్డిస్తారు. ఎంత తిన్నా, బొజ్జ గణపయ్య ఆకలి తీరదు. అప్పుడు అనసుయాదేవి వరిపిండితో చేసిన కుడుము ఒకటి ఇస్తుంది. అది తినగానే గణపతి బొజ్జనిండి 21సార్లు త్రేన్చాడట. అప్పటి నుంచి 21 కుడుములను గణపతికి నైవేద్యంగా పెడుతున్నారు. 21 కుడుముల్లో.. ఒకటి దేవుడికి, 10 ఇతరులకు దానం, మిగిలినవి మనం నైవేద్యంగా స్వీకరించాలని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంలో కొందరు తెలియక పొరపాట్లు చేస్తున్నారు. వినయక చవితి  రోజూ అందరూ ఉదయానే తలస్నానాలు చేసి.. కొత్త బట్టలు ధరించి..స్వామి వారిపూజలో నిమగ్నం అవుతారు.

దేవుడి గదిని, వినాయకుడి ప్రతిమని పూలతో ఎంతో అందంగా అలంకరిస్తారు. అలానే గణపతి దేవుడికి కుడుములు, ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అలానే గణపతి దేవును శోత్రాలు చదివి పూజను పూర్తి చేస్తారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. తీర్ధ ప్రసాదాల విషయంలో కొందరు పొరపాట్లు చేస్తుంటారు. దేవుడికి వద్ద ఏమి లేకుండా మొత్తం కుడములను తీసుకోవడం, దానం చేయకపోవడం, లేకుంటే మొత్తం కుడుములను దేవుడి వద్దనే ఉంచడం చేస్తుంటారు. దేవుడి వద్ద అలానే ఉంచిన కుడుములు పాడైపోతుంటాయి.

అలానే చేయడం కూడా పాపమని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దేవుడి వద్ద పెట్టిన కుడుములు అన్ని మనమే తినకుండా..పండితులు చెప్పిన ప్రకారం.. చేస్తే..దేవుడి అనుగ్రహం ఉంటుంది. దేవుడి వద్ద ఒకటి, 10దానం, మిగిలినవి నైవేద్యంగా స్వీకరిస్తే.. పుణ్యం కలుగుతుంది. ఇలాంటి పొరపాట్లు తెలియక చేస్తే.. ఏం కాదు. కానీ తెలిసి మాత్రం చేస్తే మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ఇక మీరు గణపతికి ఇష్టమైన రీతిలో పూజలు చేసి.. ఆయన కరుణకటాక్షలు పొందవచ్చు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:

ఈ పనులు చేసి.. వినాయకుడి మండపాల్లోకి వెళ్ళకండి! మహాపాపం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి