Krishna Kowshik
కేరళలోని తిరువనంతపురంలో కొలువైన ఉన్న అనంత పద్మనాభ స్వామి ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అక్కడ నేలమాళిగల్లో బయటపడిన వజ్రాలు, బంగారు, వెండి ఆభరణాలతో దేశంలోనే అత్యధిక సంపద కలిగి ఉన్న దేవాలయంగా పేరుగాంచిన ఈ గుడి.. ఇప్పుడు మరోసారి..
కేరళలోని తిరువనంతపురంలో కొలువైన ఉన్న అనంత పద్మనాభ స్వామి ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అక్కడ నేలమాళిగల్లో బయటపడిన వజ్రాలు, బంగారు, వెండి ఆభరణాలతో దేశంలోనే అత్యధిక సంపద కలిగి ఉన్న దేవాలయంగా పేరుగాంచిన ఈ గుడి.. ఇప్పుడు మరోసారి..
Krishna Kowshik
కొన్ని సార్లు అద్భుతాలు జరుగుతాయంతే. జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు. వండర్ జరిగాక అటోమేటిక్‌గా తెలిసి పోతుంది అంతే. అటువంటి ఓ అబ్బుర పరిచే సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అది మన దేశంలోనే చోటుచేసుకోవడం విశేషం. దేశంలోనే అత్యధిక సంపద కలిగిన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ ఆలయం. ఇక్కడ శ్రీ మహా విష్ణువు శేష పాన్పుపై యోగ నిద్రలో కొలువై ఉన్నాడు. ఇక్కడ నేలమాళిగల్లోని టన్నుల కొద్దీ బంగారం, వెండి బయటపడిన సంగతి విదితమే. అంతేకాకుండా ఇక్కడ ఆరవ గది ఇంకా మూత పడే ఉంది. దీనికి నాగ బంధం వేసి ఉండటంతో ఆ గదిని తెరిచేందుకు సాహసం చేయడం లేదు.
ఈ గుడికి మూలస్థానంగా పిలవబడుతోంది కాసర్ గఢ్ జిల్లాలోని కుంబ్లాలోని అనంతపుర సరస్సు దేవాలయం. ఆ దేవాలయానికి ఆనుకొని ఉన్న కొలనులో ఓ మొసలి ఉండేది. దాని పేరు బబియా. గత ఏడాది అక్టోబర్ 9న ఆ మొసలి చనిపోవడంతో ఘనంగా అంత్యక్రియలు కూడా నిర్వహించారు. బబియా చనిపోయిన ఏడాది తర్వాత ఆ సరస్సులో ఇప్పుడు మరో మకరం (మొసలి) ప్రత్యక్షమైంది. ఈ విషయం దావానలంలా దేశమంతా పాకింది. ఈ నెలలో సరస్సులో మొసలి తిరుగుతున్న ఆనవాళ్లను గుర్తించిన కొందరు.. ఆలయ అధికారులకు సమాచారం అందించారు. శనివారం ఆ మొసలిని కనుగొన్నారు అధికారులు. ఈ విషయం ఊరువాడా, దేశ మంతా పాకిపోయింది. అసలు ఆ మొసలి ఎలా వచ్చింది, ఎక్కడ నుండి వచ్చింది అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ మొసలిని తిలకించేందుకు తండోపతండాలుగా వస్తున్నారు.
అయితే ఈ సరస్సులో కొత్త మొసలి ప్రత్యక్షం కావడం ఇది మొదటి సారి కాదని ఆలయ వర్గాలు చెబతున్నాయి. ఆలయ గ్రంధాల్లో ఓ మొసలి చనిపోతే మరొకటి వస్తుందని రాసి ఉన్నట్లు ఉందని అంటున్నారు. బబియా కన్నా ముందు రెండు మొసళ్లు ఆ సరస్సులో ఉండేవని చెబుతున్నారు. ఓ సారి బ్రిటీష్ సైన్యం ఓ మకరాన్ని కాల్చివేయగా.. మరో మొసలి వచ్చిందని, అది మరణించాక.. బబియా అనే మొసలి ప్రత్యక్షమైందని కథనాలు వినిపిస్తున్నాయి. బబియా పూర్తి శాకాహారమని, ఆలయ పూజారి పెట్టే ప్రసాదంతోనే జీవించేదని, భక్తులు ఇచ్చే పండ్లు స్వీకరించేదని, అలా 70 ఏళ్ల పాటు బ్రతికినట్లు పేర్కొటున్నారు. ఇప్పుడు కనిపిస్తున్న మొసలి చాలా చిన్నదని, ప్రధాన పూజారికి విషయం చెప్పామని, ఆయన ఏం చెబితే.. అది చేస్తామంటున్నారు ఇతర పూజారులు. ఒక మొసలి పోతే.. మరో మకరం ప్రత్యక్షమవ్వడంపై మీరేమనుకుంటున్నారో అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.