Vinay Kola
Hanuman murthi: హనుమంతుల వారు ఎందరికో ఆదర్శం. సీతా రాములని కలపడంలో ఆంజనేయ స్వామి పాత్ర ఎంతో ఉంది.
Hanuman murthi: హనుమంతుల వారు ఎందరికో ఆదర్శం. సీతా రాములని కలపడంలో ఆంజనేయ స్వామి పాత్ర ఎంతో ఉంది.
Vinay Kola
ఆగస్టు 18న ఆదివారం నాడు టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో ఎంతో ఘనంగా ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తాజా సమాచారం ప్రకారం ఇది యునైటెడ్ స్టేట్స్‌లో మూడవ ఎత్తైన విగ్రహంగా నిలిచింది. ఇక ఈ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ అని పేరు పెట్టారు. టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్‌లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ఇది ఆవిష్కరించబడింది. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న శ్రీ చిన్నజీయర్ స్వామీజీ సహాకారం ఉంది. ఈ విగ్రహాన్ని శ్రీరాముడు ,సీతను తిరిగి కలపడంలో హనుమంతుని పాత్రను గుర్తు చేసుకోడానికి, అలాగే ఆయన గొప్ప తనాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశ్యంతో ప్రాణ ప్రతిష్ట చేశారు.
ఈ విగ్రహం నార్త్ అమెరికాలోనే హనుమంతుని యొక్క ఎత్తైన విగ్రహమని, ఇది బలం, భక్తి మరియు నిస్వార్థ సేవా స్వరూపమని స్టాట్యూ ఆఫ్ యూనియన్ వెబ్‌సైట్ చెబుతోంది. అలాగే భావి తరాల వారు హనుమంతుని దివ్య ఆశీర్వాదాలను పొందేందుకు ఒక మార్గాన్ని రూపొందించడానికి ఇదొక మంచి అవకాశమని పేర్కొంది. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అనేది ఆధ్యాత్మిక కేంద్రాన్ని సృష్టిస్తుందని, ఇక్కడికి వస్తే మన మనస్సులు చాలా ప్రశాంతంగా ఉంటాయని, మన ఆత్మలు పరమార్థానికి మార్గాన్ని కనుగొంటాయని పేర్కొంది. ఈ హనుమాన్ విగ్రహం యొక్క దర్శనానికి జీవం పోద్దాం.. అంతా కలిసి ప్రేమ, శాంతి మరియు భక్తితో నిండిన ప్రపంచాన్ని సృష్టిద్దాం అని స్టాచ్యూ ఆఫ్ యూనియన్ వెబ్ సైట్ పేర్కొంది.
హనుమంతుని కథ ఎందరికో ఆదర్శం. సీతా రాములని కలపడంలో హనుమంతుల వారి పాత్ర ఎంతో ఉంది. వాల్మీకి మహర్షి రామాయణంలో హనుమంతుని గొప్ప తనం గురించి ఎంతో అద్భుతంగా ఉంటుంది. హనుమంతుల వారి విగ్రహాన్నీ ప్రాణ ప్రతిష్ఠ చెయ్యడంతో అమెరికాలోని హ్యూస్టన్..దివ్య నగరంగా మారింది. ఆంజనేయ నామ స్మరణతో ఆ నగరం మారుమోగిపోతుంది. ఇది నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు గర్వ కారణం అనే చెప్పాలి. అగ్ర రాజ్యంలో ఆంజనేయుడి ప్రాణ ప్రతిష్ట అనేది ఎన్నో కోట్ల మంది భారతీయులకు ఎంతో సంతోషాన్ని కలిగించే అంశంగా మారింది. సోషల్ మీడియాలో జై హనుమాన్ అంటూ నెటిజన్స్ ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోని తెగ ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ స్ట్యాచ్యు ఆఫ్ యూనియన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Prana pratishtha held today in Houston, Texas for this 90ft tall Hanuman murthi
It is now the 3rd tallest statue in the United States pic.twitter.com/N7sNZaikBF
— Journalist V (@OnTheNewsBeat) August 19, 2024